ఇజ్రాయెల్‌లో వధూవరులు తమ మత సమాజం ఆధ్వర్యంలో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దేశంలో మతాంతర వివాహాలు చట్టబద్ధంగా చెల్లవు. పూర్వకాలంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఎటువంటి విధానాలను పాటించారో ఇప్పుడు కూడా అదే వివాహ విధానాలను పాటిస్తున్నారు. ఒకే మత విశ్వాసాలు ఉన్న వధూవరులు మాత్రమే వివాహం చేసుకోవలసిందిగా ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఓ చట్టం ఉండేది. అయితే ఈ చట్టాన్ని బ్రిటిషర్లు సవరించలేదు. దీంతో ఆ పెళ్లి నిబంధన ఇజ్రాయెల్ లో ఇప్పటికీ అమలులో ఉంది.


ఈ దేశంలోనే 3-4 రకాల సామాజిక వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. వారందరూ కూడా తమ మత పెద్దల ఆధ్వర్యంలో పెళ్లి చేసుకుంటారు. ఐతే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇజ్రాయెల్ దేశం లో డివోర్స్ రేటు చాలా తక్కువగా ఉంటుందని అంటుంటారు. ఐతే 2019 వరకు నమోదైన గణాంకాల ప్రకారం.. యూదు జాతి ప్రజల డివోర్స్ రేటు ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతోందని తెలుస్తోంది. 2018 లో 11,145 దంపతులు విడాకులు తీసుకున్నారు.



అయితే ఇజ్రాయెల్ దేశంలో విడాకుల రేటు చాలా తక్కువగా నమోదవుతుందని అప్పట్లో గణాంకాల ప్రకారం చెప్పేవారు. అయితే ప్రత్యేకించి ఈ దేశంలోనే దంపతులు ఎందుకు తక్కువగా విడాకులు తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. అందులో సిబిఎస్ పబ్లికేషన్ కూడా ఒకటి. అయితే మీ పరిశోధనలలో తేలింది ఏంటంటే.. ఇజ్రాయెల్ దేశం చనిపోయిన లేదా వలస వెళ్ళిన దంపతులను లెక్కలోకి తీసుకోదు. వారు డివోర్స్ తీసుకున్నా.. తీసుకోకపోయినా వారి వివాహాల గురించి ఇజ్రాయెల్ ఎటువంటి రికార్డు మెయింటైన్ చేయదు. అలాగే ఇతర దేశాల నుంచి ఇజ్రాయెల్ దేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత విడాకులు తీసుకుంటే వారి లెక్కలు కూడా పరిగణలోకి తీసుకొనబడవు.



ఇకపోతే ఇజ్రాయెల్‌లో మొత్తం విడాకుల రేటు 26% -27% (2006-2011) ఉందని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఐతే ఐరోపా దేశాల్లో 35% (2003) విడాకుల రేటు నమోదయింది. ఐరోపాలో విడాకుల రేటు తక్కువగా చూపిస్తారట. కానీ ఇజ్రాయెల్‌లో డివోర్స్ రేటు దాదాపు 99% ఖచ్చితత్వంతో నమోదు చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: