
అయినప్పటికీ ట్విట్టర్ ఇష్టానుసారంగా వ్యవహరించడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారి నియమించుకుని నివేదిక అందించాలని అంటు కేంద్రం ట్విట్టట్ కు సూచించింది. కానీ ట్విట్టర్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త గా తీసుకొచ్చిన ఐపీఎస్ చట్టం లోని నిబంధనలు అన్నింటిని పాటించడంలో ట్విట్టర్ పూర్తిగా విఫలం అయింది అంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పటికే ఇక కొత్త ఐటీ చట్టం నిబంధనలు పాటించేందుకు ట్విట్టర్ కు ఎన్నోసార్లు అవకాశాలు కల్పించాము అంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ అన్ని సామాజిక మాధ్యమాలు కొత్త ఐటీ చట్టం ప్రకారం నిబంధనలు పాటిస్తూ ఉంటే.. ట్విట్టర్ మాత్రమే పాటించటం లేదు అంటూ ఢిల్లీ హైకోర్టులో తెలిపింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర సూచించిన విధంగా ట్విట్టర్ కనీసం ఫిర్యాదుల అధికారిని కూడా నియమించలేదు అంటూ తెలిపింది కేంద్రం. అయితే కొత్త ఐటీ చట్టం ప్రకారం నిబంధనలు పాటించేందుకు సమయం అడిగిన ట్విట్టర్ ఇక ఈ నిబంధనలు పాటించడం లో విఫలం కావడంతో ప్రస్తుతం మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది అంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.