
ఈ క్రమంలోనే చంద్రబాబు పార్టీలోని సీనియర్లు సైతం యనమలను పక్కన పెట్టేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటి కి యనమల మాట టిడిపిలో ఎంత మాత్రం చెల్లుబాటు కాదని అంటున్నారు. ఇక ఇప్పుడు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నలభై వేల కోట్ల లెక్కలు ఏమైపోయాయని ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత జరుగుతున్నా గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల మాత్రం కిమ్మనడం లేదు. దీని వెనక టీడీపీ వర్గాల్లోనే ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి.
యనమల మాట్లాడితే ఏపీలో ఎవ్వరూ నమ్మరని చంద్రబాబు.. టీడీపీలో కొందరు కీలక నేతలు డిసైడ్ అయిపోయారట. అందుకే వాళ్లంతా యనమలను పక్కన పెట్టేసి పయ్యావులతోనే మాట్లాడిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవంగా పయ్యావుల పీఏసీ చైర్మన్ అయినప్పటకి. . గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమలకు ఇలాంటి వ్యవహారాలు కొట్టిన పిండి. అయితే ఆయన ఓ అవుట్ డేటెడ్ లీడర్ అయిపోయాడని భావిస్తున్నందునే చంద్రబాబు ఆయన్ను పక్కన పెట్టేసి మొత్తం పయ్యావుల తోనే మాట్లాడిస్తున్నారన్న చర్చలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.