హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అటు అధికార పార్టీ ఇటు బిజెపి పార్టీ గట్టిగానే... ప్రచారం చేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాలను అన్నిటిని... వదులుకోవడం లేదు పార్టీలు. ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తి గా లీడర్లను... తమ పార్టీలోకి ఉంచుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ టిఆర్ఎస్ నాలుగు ఆకులు ఎక్కువే చదివిందని చెప్పవచ్చు.  ఈ నేపథ్యంలో ఇప్పటికే 2018 కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి... గులాబీ కండువా కప్పింది అధికార టిఆర్ఎస్ పార్టీ. ఈ కార్డు బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్నా ఈటల రాజేందర్... పాదయాత్రలో టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నారు.

ఈ పాదయాత్రలో భాగంగా రాత్రి సమయంలో బహిరంగ సభను కూడా నిర్వహించి... తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు అన్యాయం చేశారంటూ ప్రజలకు ఎత్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి తన సొంతం ఊరు అయినా కమలాపూర్ లో బహిరంగ సభ నిర్వహించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఈటెల రాజేందర్ ప్రస్తావించారు. అలాగే తెలంగాణ లో కరెంటు ఉత్పత్తి పై ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ బహిరంగ సభలో ఉన్న ప్రజలు ఈటెల రాజేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'టిఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు కరెంటు ఇవ్వడం లేదని...24 గంటల కరెంటు ఉంటుందని... ఈటెల ప్రసంగానికి అడ్డుపడ్డారు ప్రజలు. దీంతో ఈటెల రాజేందర్ కూడా ప్రజల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బహిరంగ సభ రసాభాసగా సాగింది. బిజెపి కార్యకర్తలు మరియు ప్రజల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ వాగ్వాదానికి సంబంధించిన ఓ వీడియో టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈటెల రాజేందర్ కు సొంత నియోజకవర్గం లోని ప్రజాదరణ లేదంటూ... టిఆర్ఎస్ కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: