ఏపీలో ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావిడి క‌నిపిస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ వ‌చ్చే మార్చి నుంచే పీకే టీంను రంగంలోకి దింపుతార‌ని ... ఈ టీం ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్లి స్థానిక ఎమ్మెల్యేల ప‌ని తీరుపై ప‌రిశీల‌న చేసి నివేదిక‌లు ఇస్తుంద‌ని అంటున్నారు. ఆ నివేదిక‌ల ద్వారా.. ఎమ్మెల్యేల ప‌నితీరు ఆధారంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ టిక్కెట్లు ఇస్తార‌ని అంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేల ప‌నితీరు స‌రిగా లేదు. దీంతో వారికి ఇప్ప‌టికే రెండు, మూడు వార్నింగ్‌లు వెళ్లాయి. ప‌ని తీరు మెరుగు ప‌రుచుకోక పోతే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీళ్ల‌కు టిక్కెట్ క‌ట్ అని కూడా సిగ్న‌ల్స్ వ‌స్తున్నాయి. అయినా కొంద‌రు ఎమ్మెల్యేలు మాత్రం మాకేంటి.. మాకు ఎందుకు టిక్కెట్లు ఇవ్వ‌ర‌న్న గ‌ర్వంతో ఉంటున్నారు. ఇలాంటి వాళ్ల‌కు పీకే ఇచ్చే నివేదిక ఆధారంగానే ఈ సారి టిక్కెట్లు ఉండ‌వ‌నే అంటున్నారు.

ఈ సారి గుంటూరు జిల్లాలో మాత్రం భారీ మార్పులు. చేర్పులు త‌ప్ప‌వ‌నే అంటున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లు యేడాది ముందుగానే వ‌స్తు జిల్లాలో ఈ సారి అధికార వైసీపీకి చెందిన ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు ఖ‌చ్చితంగా ఓడిపోతారే ప్ర‌చారం జిల్లాలో భారీ ఎత్తున జ‌రుగుతోంది. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ ప్ర‌భావం ఈ సారి జిల్లాలో పెద్ద ఎత్తున న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే జిల్లాలో రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ - మంగ‌ళ‌గిరి స్థానాల‌తో పాటు చిల‌క‌లూరిపేట‌, వినుకొండ‌, వేమూరు, బాప‌ట్ల‌, పొన్నూరు, ప్ర‌త్తిపాడు సీట్ల‌లో వైసీపీ కి ఈ సారి ఎదురు దెబ్బ‌లు త‌ప్పేలా లేవంటున్నారు.

రాజ‌ధాని వికేంద్రీ క‌ర‌ణ నేప‌థ్యంలో ఈ సారి జిల్లాలో అధికార పార్టీ పెద్ద ఎదురు దెబ్బ‌లు త‌ప్పేలా లేవు. ఈ విష‌యం వైసీపీ ఎమ్మెల్యేలు, నేత‌ల‌కు కూడా తెలిసినా వారు కూడా ఏం చేసే ప‌రిస్థితి లేదు. నోరు మెదిపి అధిష్టానం వ‌ద్ద త‌మ ఇబ్బంది చెప్పుకునే ఛాన్స్ లేదు. అదేమంటే సంక్షేమం అమ‌లు చేస్తున్నాం మ‌ళ్లీ మ‌న‌మే బంప‌ర్ మెజార్టీతో అధికారంలోకి వ‌స్తామ‌ని చెపుతున్నారే త‌ప్పా జిల్లా నేత‌ల బాధ‌లు విన‌డం లేద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: