మరో వైపు ఇటు జనసేన నేత లే కాకుండా.. అటు టీడీపీ వాళ్లు సైతం ఈ రెండు పార్టీల పొత్తుకు సుముఖంగానే ఉన్నారు. టీడీపీ లోనే పలువురు సీనియర్లు జనసేన తో పొత్తు ఉంటే ఖచ్చితంగా వైసీపీ ని తునాతున కలు చేయవచ్చనే అంటున్నారు. ఇటీవల స్థానికంలో కొన్ని చోట్ల అధిష్టానం తో సంబంధం లేకుండా ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని భారీ స్థాయిలో ఓటింగ్ తెచ్చుకోవడంతో పాటు సీట్లు గెలుచుకున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు పని చేసిన రాజోలు, నరసాపురం, కోనసీమ లాంటి ప్రాంతాల్లో వైసీపీ ఆధిపత్యానికి గండి పడింది.
టీడీపీ తో పొత్తు ఉంటే జనసేన గట్టి ప్రభావం చూపుతుందని అంచనా వేస్తోన్న కొందరు మాజీ లు ఇప్పుడు ఆ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారట. వీరిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ముందు వరుసలో ఉన్నారట. ఆయన ప్రతి ఎన్నికకు, నియోజకవర్గం, పార్టీ మార్చడం కామన్. ఇక పశ్చిమ గోదావరిలో ఒక మాజీ ఎమ్మెల్యే, తూర్పులో మరో మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఒకరు జనసేన లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
అయితే పవన్ మాత్రం వీరు జనసేన లో చేరే విషయంలో అంత సుముఖత వ్యక్తం చేయలేదట. ఈ నేతలు ఎవరి స్వార్థం వారు చూసుకుంటారని.. పార్టీకి ఉపయోగ పడరని.. వీరికన్నా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న వారితో పాటు తటస్థులు, డాక్టర్లను పార్టీలో చేర్చుకోవాలని ఆయన భావిస్తున్నారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి