ఏపీలో సీనియర్ నాయకులు....తమ వారసులని రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో తమ వారసులని బరిలో దింపడానికి పలువురు సీనియర్లు ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్ నేతల వారసులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల్లో పలువురు సీనియర్ నేతల వారసులు ఎన్నికల బరిలో దిగారు.

అయితే వచ్చే ఎన్నికల్లో మరికొందరు నేతల వారసులు బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు వారసులు రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. తమ తండ్రులకు అండగా రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టి‌డి‌పి సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారసుడు....రాజగోపాల్ రెడ్డి కూడా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం ఎప్పుడో మొదలుపెట్టారు. గతంలో టి‌డి‌పి అధికారంలో ఉండగా సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు...అలాగే మధ్యలో చంద్రబాబు, సోమిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు.

సోమిరెడ్డి మంత్రి అయ్యాక, సర్వేపల్లి బాధ్యతలు రాజగోపాల్ చూసుకున్నారు. అలాగే ఒకానొక సమయంలో రాజగోపాల్ షాడో మంత్రిగా పనిచేశారనే విమర్శలు కూడా వచ్చాయి. తండ్రి ప్లేస్‌లో తనయుడు మంత్రిగా వ్యవహరిస్తున్నారని, మంత్రి పదవిని రాజగోపాల్ అద్దెకు తీసుకున్నారనే విమార్శలు వచ్చాయి. అంటే ఈ తరహాలో విమర్శలు వచ్చాయంటే...రాజగోపాల్ ఏ విధంగా రాజకీయం చేశారో అర్ధమవుతుంది.

అయితే ఇలా పనిచేసిన రాజగోపాల్‌ని నెక్స్ట్ ఎన్నికల బరిలో దించాలని సోమిరెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో గత నాలుగు పర్యాయాలుగా సోమిరెడ్డికి లక్ కలిసి రావడం లేదు....1994, 1999 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి గెలిచిన సోమిరెడ్డి....2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. మరి ఈ సారి సోమిరెడ్డి బరిలో దిగి అదృష్టం పరిశీలించుకుంటారా లేక, తనయుడుని బరిలో దింపుతారా అనేది చూడాలి.

కాకపోతే సోమిరెడ్డి రెండు టిక్కెట్లు తీసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. నెల్లూరు పార్లమెంట్‌లో ఎలాగో టి‌డి‌పికి అభ్యర్ధి లేరు....సోమిరెడ్డి అటు వెళ్ళి, తనయుడు రాజగోపాల్‌ని సర్వేపల్లి బరిలో దింపే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఈ సారి సోమిరెడ్డి వారసుడి అరంగ్రేటం ఉంటుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: