గత ఎన్నికల తర్వాత చాలామంది రాజకీయ నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. ఊహించని విధంగా ఓటమి ఎదురువ్వడంతో పలువురు నేతలు, పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించకుండా వెళ్ళిపోయారు. పోనీ పార్టీలు మారినా సరే కంటికి కనబడటం లేదు. అధికార వైసీపీలోకి వెళ్ళినా సరే అడ్రెస్ లేకుండా పోయారు. అలా రాజకీయాల్లో కనిపించని నాయకుల్లో నందమూరి బాలకృష్ణ ఫ్రెండ్ కదిరి బాబూరావు కూడా ఒకరు.

బాబూరావు....బాలయ్య ఫ్రెండ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరు కలిసి చదువుకున్నారు. ఫ్రెండ్ కాబట్టే బాలయ్య...బాబూరావుకు టిక్కెట్ కూడా ఇప్పించుకున్నారు. 2014 ఎన్నికల్లో కనిగిరి సీటు ఇప్పించారు. ఆ ఎన్నికల్లో బాబూరావు టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా టి‌డి‌పి కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో మంచిగా పనులు చేసుకుని ప్రజలకు దగ్గర అవ్వొచ్చు. అలాగే బాలయ్య ఉన్నాడు కాబట్టి, ఆయనకు చెప్పి పనులు చేయించుకునే అవకాశం కూడా ఉంది.


కానీ బాబూరావు కనిగిరి ప్రజలకు ఐదేళ్లలో పెద్దగా సేవ చేయలేదు. ఆయనపై తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకత పెరిగింది. అసలు 2019 ఎన్నికల్లో ఈయనకు సీటు ఇవ్వొద్దని కనిగిరి టి‌డి‌పి శ్రేణులు డిమాండ్ చేశాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి చంద్రబాబు సీటు ఇచ్చారు. అలాగే బాలయ్య ఫ్రెండ్ కాబట్టి బాబూరావుకు అన్యాయం చేయకుండా దర్శి టిక్కెట్ ఇచ్చారు.

కానీ జగన్ వేవ్‌లో అటు ఉగ్రనరసింహ, ఇటు బాబూరావు ఓటమి పాలయ్యారు. అయితే ఓడిపోయాక బాబూరావు...అనూహ్యంగా వైసీపీలో చేరిపోయారు...వైసీపీలో చేరేటప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేశారు...కానీ బాలయ్యని ఏం అనలేదు. బాలయ్య ఎప్పటికీ తన ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళిపోయారు. వైసీపీలోకి వెళ్ళాక బాబూరావు అడ్రెస్ లేరు. అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. పైగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో పరిస్తితులని బట్టి బాలయ్యతో మాట్లాడుకుని బాబూరావు మళ్ళీ టి‌డి‌పిలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk