ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిర‌స‌న దీక్ష‌ల‌కు కౌంట‌ర్లుగా వైసీపీ జ‌నాగ్ర‌హ దీక్ష‌లు  చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల పాటు జ‌రుగుతోన్న ఈ దీక్ష‌ల్లో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గం లో జరుగుతున్న జనాగ్రహ దీక్ష కు ఎంపీ విజయసాయిరెడ్డి - మంత్రి అవంతి శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. ఈ స‌ద‌ర్భంగా విజ‌య‌సాయి రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో విమర్శ చేస్తే సహేతుకంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని. అయితే టీడీపీ అందుకు భిన్నంగా వ్యవరుస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ అన్ని ఎన్నిక‌ల‌లో ఓడిపోతూ వ‌స్తోంద‌ని. అందుకే వారిలో ప్ర‌స్టేష‌న్ పెరిగి పోతోంద‌ని.. ఇప్పుడు ఆ పార్టీ ప‌రిస్థితి వెంటిలేటర్ పై ఉంది అని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాలను అభివృద్ది పథంలో నడిపిస్తుంటే... చంద్రబాబు కొన్ని వర్గాలను ఉపయోగించుకొని పరిపాలనకు అడ్డుపడుతున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌తిప‌క్ష పార్టీ అనేది ప్రజా సమస్యలు పై పోరాడాలే త‌ప్పా... రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులను దూషించ కూడ‌ద‌ని సూచించారు. ఇక చంద్ర‌బాబు ఏపీలో ఎప్ప‌ట‌కీ అధికారం లోకి రాలేరు అని ఎద్దేవా చేశారు.

ఇక మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తాన‌ని.. లేకపోతే చంద్రబాబు త‌న ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తారా ? అని స‌వాల్ విసిరారు. ఇక గంజాయి విమ‌ర్శ‌ల‌పై స్పందిస్తూ గంజాయి డాన్ అయ్యన్న ను ప‌క్కన పెట్టుకొని చంద్రబాబు గంజాయి కోసం మాట్లాడడం కామెడీగా ఉంద‌న్నారు. టీడీపీ లో గెలిచి లోకేష్ బాధ తట్టుకోలేక కొందరు ఎమ్మెల్యే లు మా వైపుకు వ‌చ్చేశార‌ని అవంతి అన్నారు.

చంద్ర‌బాబు జగన్ కు వస్తున్న మంచి పేరు చూడలేక అసత్య ఆరోపణలు చేస్తున్నార‌ని.. బాబుది సొంత మామ‌ ను చంపి పార్టీ ని చేతులలోకి తీసుకున్న చ‌రిత్ర అని ఎద్దేవా చేశారు. ఇక హత్య రాజకీయాలు చేయ‌డం అనేది చంద్రబాబు కి వెన్నతో పెట్టిన విద్య అని.. ఆయ‌న తక్ష‌ణ‌మే ముఖ్యమంత్రి జగన్ కు  క్షమపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: