ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీలో విభేదాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది కీలక నాయకులు పార్టీలో నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఆధారంగా ఎదురుచూస్తున్నారని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని కీలక అంశాలు ప్రభావితం అవుతున్న తరుణంలో విభేదాలను చంద్రబాబు నాయుడు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం కొంతవరకు వ్యక్తమవుతోంది.

రాజకీయంగా వైసిపి క్రమంగా పూర్తిస్థాయిలో బలపడటం తెలుగుదేశం పార్టీకి ప్రధాన సమస్య. ప్రభుత్వ పనితీరు విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వార్తలు తెలుగుదేశం పార్టీని బాగా కలవరపెడుతున్నాయి. చాలామంది కీలక నాయకులు ఈ మధ్య కాలంలో దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న సరే అది…అది ఫలించడం లేదు అనే భావన కూడా ఉంది. ఇక దూకుడుగా ముందుకు వెళ్లే నాయకులను కట్టడి చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా కొంతవరకు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కీలక నాయకులు ప్రజలతో సంబంధాలు కోల్పోయారు అనే భావన కూడా కొంత వరకు ఉంది.

రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కనుగొన్న విషయాలను సీరియస్ గా తీసుకుని విభేదాలను పరిష్కరించకపోతే చాలామంది నాయకులు పార్టీకి గుడ్బై చెప్పే అవకాశాలు ఉన్నాయి అనే భావన వ్యక్తమవుతోంది. స టిడిపిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకు రాకపోతే మాత్రం పంచాయతీ ఎన్నికల ఫలితాలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మరిన్ని భవిష్యత్తులో బయటపడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. యువ నాయకులు తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి కూడా ఉత్సాహంగా పాల్గొనే వారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కనపడకపోవడం ఆ పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: