నిదానంగా తెలుగుదేశం పార్టీ ఫామ్‌లోకి వస్తుంది...నేతలు కూడా యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు. అధికార వైసీపీకి ధీటుగా పనిచేయడం స్టార్ట్ చేశారు...ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ నేతలు గట్టిగానే కష్టపడుతున్నారు. పైగా కొన్ని సీట్లలో పోటీ కూడా మొదలైంది. టీడీపీ బలంగా ఉన్న సీట్లని దక్కించుకోవడం కోసం తమ్ముళ్ళు పోటీపడుతున్నారు. ఇదే క్రమంలో గుంటూరు వెస్ట్ సీటుపై చాలామంది టీడీపీ నేతలు కన్నేశారు.

రాష్ట్ర విభజన జరిగాక...గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోటగా మారింది...అందుకే వరుసపెట్టి 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. పార్టీ గెలుస్తుంది..కానీ నాయకులు మాత్రం పార్టీలో ఉండటం లేదు. అలా అని వెస్ట్‌లో టీడీపీ బలం మాత్రం తగ్గడం లేదు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి...2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.

దీంతో 2019 ఎన్నికల్లో వెస్ట్‌ బరిలో మద్దాలి గిరిని దింపారు...జగన్ గాలి ఉన్నా సరే టీడీపీ గెలిచేసింది. వెస్ట్ ప్రజలు టీడీపీకే ఎక్కువ సపోర్ట్ ఉండటంతో గిరి గెలిచారు. ఇక గెలిచిన గిరి కూడా వైసీపీ వైపు జంప్ కొట్టేశారు. దీంతో ఇప్పుడు వెస్ట్ ఇంచార్జ్‌గా కోవెలమూడి రవీంద్రని నియమించారు. ఆయన దూకుడుగానే పనిచేస్తున్నారు...కానీ సీటు దక్కే విషయంలో మాత్రం గ్యారెంటీ లేకుండా పోయింది. ఎలాగో అమరావతి ఎఫెక్ట్...వైసీపీపై వ్యతిరేకతలని చూసుకుంటే వెస్ట్‌లో టీడీపీకి మళ్ళీ మంచి ఛాన్స్ ఉంది.

అందుకే ఈ సీటు కోసం రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబు ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ముందు సత్తెనపల్లి కోసం చూస్తున్నారు గానీ, ఆ సీటులో కోడెల తనయుడు ఉన్నారు..దీంతో ఆయన వెస్ట్‌పై కన్నేశారు. అటు పెదకూరపాడు ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సైతం వెస్ట్ సీటు కోసం ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. పెదకూరపాడు కంటే వెస్ట్‌లోనే ఈజీగా గెలవచ్చని అనుకుంటున్నారు. మరి చంద్రబాబు..వెస్ట్ సీటు ఎవరికి కన్ఫామ్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: