
ఈ సమస్యలకు సరైన సమాధానం రాలేదని ఇప్పటికే రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. దీంతో సమస్యలను సత్వరం పరిష్కారించాలంటూ ప్రధాని మోదీని vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల కేటాయింపు, రైల్వే జోన్ వ్యవహారం, నిధుల విడుదల వంటి కీలక అంశాలను ప్రస్తావించారు వైసీపీ ఎంపీ. గతంలో ఇచ్చిన విభజన హామీలను అమలు చేసేందుకు కృషి చేయాలని కూడా ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని కూడా కోరారు. రెండేళ్లుగా ప్రాజెక్టు సవరించిన అంచనాల విషయంలో ఎన్ని సార్లు లేఖలు రాసినా కూడా కేంద్రం ఏ మాత్రం స్పందించడం లేదు. అలాగే ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల లెక్కల వివరాలను తక్షణమే సమర్పించాలని కూడా కేంద్ర జల శక్తి శాఖ ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూనే ఉంది. దీంతో ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తి చేయటం కష్టమని ఇప్పటికే రాష్ట్ర అధికారులు తేల్చేశారు.