మరోవైపు జనసేనతో టిడిపి పొత్తు ఉంటుందన్న ప్రచారం కూడా పార్టీ నేతల మధ్య ప్రధానంగా చర్చకు వస్తుంది. 2014 ఎన్నికల్లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపికి మద్దతు ఇచ్చింది. అయితే గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఒక రాజోలు సీటుతో మాత్రమే సరిపెట్టుకుంది. అయితే జనసేన వల్ల టిడిపి ఏకంగా 40 స్థానాల్లో ఓడిపోయింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే తెలుగుదేశం - జనసేన నేతల మధ్య పొత్తు గురించి రెండు మూడు సార్లు చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. బిజెపి కూడా ఈ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తుందని అంటున్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే బీఎస్పీ కూడా ఈ కూటమిలో కలుస్తుందని తెలుస్తోంది. ఈ కుట్రలో ప్రధాన పార్టీగా టిడిపి ఉంటుంది. అయితే బిజెపి - జనసేన - బీఎస్పీ పార్టీలతో కలిసి పోటీ చేస్తే టీడీపీ భారీగా సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఉంది.
చాలా నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ చెల్లా చెదురు అయ్యే ప్రమాదం కూడా ఉంది. మూడు పార్టీలు కలిస్తే టీడీపీ - 100 సీట్లు , జనసేన - 50 , బీజేపీ - 20 , బీఎస్పీ+ఇతరులు - 5 సీట్ల లో పోటీ చేస్తాయని అంటున్నారు. అయితే ఇందుకు టీడీపీ మాత్రం ఒప్పు కోవడం లేదని.. ఇతరులకు 20 - 25 సీట్లు మించి ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి