తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు అన్న ప్రచారం ఇప్పుడు అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి చనిపోవడంతో ప‌రామ‌ర్శ‌కు వచ్చిన కేసీఆర్ నల్గొండ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే జిల్లాలో అభివృద్ధి కోసం అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులతో స‌మీక్ష నిర్వ‌హించిన‌ ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కేంద్రంగా ఉన్న నల్గొండ పట్టణ అభివృద్ధి పై కేసీఆర్ ఎక్కువగా దృష్టి సారించారు.

పట్టణంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉన్న విషయం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే అందరిముందు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ గా ఒక అధికారి పేరును సిఫార్సు చేస్తే... కెసిఆర్ ఆ పేరు పక్కన పెట్టడంతో పాటు ప్రస్తుతం సిద్దిపేట కమిషనర్ గా ఉన్న అధికారిని నల్గొండకు పంపుతానని... ఆయన చేసే పనుల్లో నువ్వేం జోక్యం చేసుకోకుండా ఉండు... అంతా ఆయనే చూసుకుంటారు అని ఓపెన్ గా చెప్పేశారట.

తమ నియోజక వర్గానికి ఎవరైనా అధికారులు కావాలని ఎమ్మెల్యేలు అనుకుంటే సీఎంను వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేసుకుంటారు. అయితే అందరి ఎమ్మెల్యేల ముందు సమీక్ష సమావేశం లోనే ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సీఎం కేసీఆర్ కు ఒక అధికారి పేరు సిఫార్సు చేయడంతో... అక్కడ ఉన్న మంత్రులు - ఎమ్మెల్యేలు సైతం అవాక్కయ్యారట‌.

ఇక కేసీఆర్ సైతం భూపాల్ రెడ్డి పై అసహనం వ్యక్తం చేసిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపాల్ రెడ్డి కేసీఆర్ వద్ద తన అనుభవలేమి ని బయట పెట్టుకున్నారని పార్టీ నేతలే గుస‌గుస లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: