గత ఎన్నికల తర్వాత చాలామంది టీడీపీ నాయకులు సైలెంట్ అయిపోయినా సరే...కొంతమంది నేతలు మాత్రం పార్టీ కోసం గట్టిగానే నిలబడ్డారు. వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైన పోరాడుతూ వస్తున్నారు. అలాగే పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ రెండున్నర ఏళ్లలో పార్టీకి కొత్త ఊపిరి పోసారని చెప్పొచ్చు. అలా పార్టీ కోసం మొదట నుంచి ప్రకాశం తెలుగు తమ్ముళ్ళు కష్టపడుతున్నారు. అందుకే తాజాగా చంద్రబాబు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, పార్లమెంట్ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా నేతలని మెచ్చుకున్నారు.

ఇందుకు కార‌ణం కూడా ఉంది. పార్టీ పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించినా కూడా ఈ జిల్లా వ‌ర‌కు జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఎలాంటి అభిప్రాయ బేధాలు లేకుండా పార్టీ నాయ‌కులు అంద‌రూ క‌లిసి ప‌ని చేస్తూ పార్టీని ఫిక‌ప్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ అధ్యక్షులు అందరికీ కలుపుకునిపోతూ.. పార్టీని బలోపేతం చేస్తున్నారని అన్నారు. దర్శి మున్సిపాలిటీలో గెలుపుకు అందరు కష్టపడి పనిచేశారని అన్నారు. బాబు చెప్పినట్లు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు బాగానే పనిచేస్తున్నారు. ముఖ్యంగా బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు మొదట నుంచి దూకుడుగానే ఉంటున్నారు.

తన పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో పార్టీ బలోపేతం కోసం బాగా కష్టపడ్డారు. అలాగే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ధీటుగా టీడీపీని నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. పార్లమెంట్ పరిధిలో దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో పార్టీని పికప్ అయ్యేలా చేశారు. అటు ఇంచార్జ్‌లని సమన్వయం చేసుకుంటూ, పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అందుకే ఇప్పుడు బాపట్లలో టీడీపీ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. వేమూరు, పర్చూరు, అద్దంకి, బాపట్ల, సంతనూతలపాడు, రేపల్లె స్థానాల్లో పార్టీ స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. ఒక చీరాలలోనే కాస్త పార్టీ సరిగ్గా లేదు.

ఇటు ఒంగోలు అధ్యక్షుడు నూకసాని బాలాజీ సైతం బాగానే కష్టపడుతున్నారు. ఏలూరి కూడా నూకసానికి సపోర్ట్ ఇస్తున్నారు. వీరందరూ కలిసే దర్శి మున్సిపాలిటీలో టీడీపీని గెలిపించుకున్నారు. అలాగే ఒంగోలు పరిధిలో టీడీపీ నేతలంతా దూకుడుగా పనిచేస్తున్నారు. దీంతో దర్శి, గిద్దలూరు, కనిగిరి, కొండపి, ఒంగోలు లాంటి స్థానాల్లో టీడీపీ స్ట్రాంగ్ అవుతుంది. మొత్తానికైతే ప్రకాశం జిల్లా తమ్ముళ్ళు గట్టొళ్లే అని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: