
ఇప్పటికే టీడీపీలో ఉన్న పలువురు రెడ్డి నేతలు...రెడ్డి వర్గాన్ని టీడీపీకి దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జేసీ ఫ్యామిలీ, కోట్ల ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీలు రెడ్డి వర్గాన్ని కాస్త టీడీపీకి చేరువయ్యేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో రెడ్డి వర్గంలో కాస్త మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే పలు చోట్ల టీడీపీకి చెందిన రెడ్డి వర్గం నేతలు పికప్ అయినట్లే కనిపిస్తున్నారు.
అయితే టీడీపీలో రెడ్డి వర్గానికి చెందిన ముగ్గురు మహిళా నేతలు ఉన్నారు. వారు కూడా పుంజుకోవడానికి చూస్తున్నారు. ముగ్గులు నేతలు కూడా కర్నూలు జిల్లాలోనే ఉన్నారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, పాణ్యంలో గౌరు చరితా రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మలు ఉన్నారు. ఈ ముగ్గురు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి మాత్రం టీడీపీ నుంచి సత్తా చాటాలని చూస్తున్నారు.
ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. వ్యక్తిగత ఇబ్బందుల వల్ల అఖిల ఇప్పుడు దూకుడుగా ఉండటం లేదు గానీ..ఆమె బదులు...సోదరుడు విఖ్యాత్ రెడ్డి ఆళ్లగడ్డలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అటు పాణ్యంలో చరితా రెడ్డి పుంజుకోవడానికి చూస్తున్నారు. ఆలూరులో సుజాతమ్మ పికప్ అయ్యారు. మరి చూడాలి ఈ ముగ్గురు రెడ్డి మహిళా నేతలు నెక్స్ట్ సత్తా చాటుతారో లేదో.