చిత్తూరు టీడీపీని పైకి లేపడానికి చంద్రబాబు నానా రకాలుగా కష్టపడుతున్న విషయం తెలిసిందే...అసలు చిత్తూరు జిల్లాలో దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో టీడీపీకి ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయి...గత ఎన్నికల తర్వాత పూర్తిగా టీడీపీకి వ్యతిరేకంగా పరిస్తితులు వచ్చాయి. ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా సీన్ మారిపోయింది...అక్కడ కూడా వైసీపీ డామినేషన్ మొదలైంది. ఈ నేపథ్యంలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా...మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ పరిస్తితిని మెరుగు పరచడానికి బాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే గతంలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న కొన్ని నియోజకవర్గాలపై బాబు ఫోకస్ పెట్టారు..అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ త్వరగా పికప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి...అందుకే అలాంటి స్థానాలపై బాబు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అలా గతంలో టీడీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో సత్యవేడు, మదనపల్లెలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టు ఉంది..కాకపోతే గత ఎన్నికల్లోనే ఘోరంగా దెబ్బతింది.

సత్యవేడులో అయితే 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ మంచి విజయాలే సాధించింది. కానీ 2019 ఎన్నికల్లో సీన్ మారింది...2014లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే తలారి ఆదిత్యపై వ్యతిరేకత రావడంతో, ఆయన్ని సైడ్ చేసి 2019 ఎన్నికల్లో రాజశేఖర్‌ని అభ్యర్ధిగా పెట్టారు. కానీ అప్పటికే సత్యవేడులో టీడీపీకి డ్యామేజ్ జరిగింది..దీంతో ఆ ఎన్నికల్లో రాజశేఖర్ ఘోరంగా ఓడిపోయారు.

అలాగే ఓడిపోయాక ఆయన పెద్దగా యాక్టివ్‌గా పనిచేయడం లేదు...దీంతో సత్యవేడులో టీడీపీ పికప్ అవ్వని పరిస్తితి. అటు మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ సైతం పెద్దగా పికప్ అవ్వలేకపోయారు. 2004 వరకు ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతూనే వచ్చింది...కానీ ఆ తర్వాత నుంచి సీన్ మారిపోయింది. గత ఎన్నికల్లో నవాజ్ బాషా వైసీపీ నుంచి గెలిచారు. ఇప్పటికీ అక్కడ ఆయన స్ట్రాంగ్‌గా ఉన్నారు. కాబట్టి మదనపల్లెలో కూడా టీడీపీకి మళ్ళీ గెలిచే అవకాశం కనిపించడం లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: