ఎన్నో రోజుల నుంచి విస్తరణ వాద ధోరణి తో  వ్యవహరిస్తున్న చైనా పొరుగున ఉన్న దేశాలకు సంబంధించిన భూభాగాలను ఆక్రమించుకోవడమె లక్ష్యంగా ఎన్నో కుట్రలు పన్నుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పొరుగున ఉన్న ఎన్నో దేశాలతో సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరించిన చైనా సరిహద్దుల్లో గొడవలు పెట్టుకుంది. ఇక అచ్చంగా ఇలాగే పొరుగునున్న భారత్ తో కూడా సరిహద్దుల్లో వివాదానికి తెరలేపింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రశాంతంగా ఉన్న భారత్ చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం రోజురోజుకీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలో భారత్-చైనా మధ్య యుద్ధం జరుగుతుందో అనే విధంగానే ఉంది ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి.


 నిషేధిత భూభాగంలోకి వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకున్న చైనా వివాదానికి కారణం అయ్యింది. ఆ తర్వాత ఎన్ని సార్లు చర్చలు జరిగినా చైనా వెనక్కి వెళ్లి పోతాము  అంటూ ఒప్పుకోవడం ఆ తర్వాత డబుల్ గేమ్ ఆడటం లాంటివి చేస్తూ ఉంది చైనా. ఇలాంటి పరిస్థితుల్లో ఇక సరిహద్దుల్లో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ అటు భారత ఆర్మీ చెబుతూ ఉండటం గమనార్హం. చైనా చేస్తున్నట్లు గానే అటు భారత్ కూడా సరిహద్దుల్లో భారీగా సైనికులను మొహరిస్తుంది. దీంతో సరిహద్దులలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి పోతున్నాయి.


 అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ఆర్మీ చీఫ్ నరవానే ఏకంగా చైనాకు ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది. సరిహద్దులలో మార్పుల కుట్రకి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. భారత్ ఏ దేశ సరిహద్దుల్లో కూడా చొరబాటు ప్రయత్నించలేదని.. కనీసం ఏ దేశాన్ని ఆక్రమించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయలేదని నరవానే స్పష్టం చేశారు. సంయమనం గా బాధ్యతాయుతంగా భారత్  ఎప్పుడు వ్యవహరిస్తూ ఉంటుంది. దీనిని అపహాస్యం చేస్తే మా సత్తా ఏంటో చూపిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు భూమిని కూడా వదులుకునే ప్రసక్తి లేదు అంటూ ఒక రకంగా చైనాకు ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు ఆర్మీ చీఫ్ నరవానే.

మరింత సమాచారం తెలుసుకోండి: