
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోసం గుంజేపల్లి గ్రామస్థులు వినూత్న నిరసన చేపట్టారు. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ గుంజేపల్లి గ్రామస్థులు ప్రకటనలు వేసి పంచుతున్నారు. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఆచూకీ చెప్పాలంటూ వినూత్న శైలిలో తమదైన నిరసనను తెలియజేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదంటూ గుంజేపల్లి ప్రజలు ఏకంగా గ్రామంలో పోస్టర్లు వేశారు. ఎమ్మెల్యే పద్మావతి తమ సమస్యలను పట్టించుకోవటం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె కనిపించడం లేదని, ఆమె ఆచూకీ తెలపాలంటూ గ్రామంలో పోస్టర్లు వేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైనా నాటి నుంచి రెండున్నర ఏళ్లలో ఒక్కసారి కూడా తమ గ్రామానికి ఎమ్మెల్యే రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ సమస్యలు తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. చివరికి ఈ ఫోటోలోని వ్యక్తి కనిపించటం లేదు అంటూ పోస్టర్లు వేశారు. గతంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కోసం కూడా ఇలాంటి పోస్టర్లే వెలిశాయి.