ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రఖ్యాతిగాంచినదో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం దేశంలోని ప్రముఖ ఆలయాలలో మొదటిగా కొనసాగుతోంది. ఇక ఈ ఆలయంలో కాలంతో సంబంధం లేకుండా  ఎప్పుడు భక్తులు తరలివస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాదు కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడిగా ప్రస్తుతం ఏడు కొండలపై విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని పునీతులు అవుతూ ఉంటారు.


 ఇక తిరుమలకు భారీగా తరలివచ్చే భక్తులు శ్రీవారికి ముడుపులు కూడా భారీగానే చెల్లించుకుంటారు. ముఖ్యంగా ఎంతమంది సంపన్నులు సైతం తిరుపతిలో భారీగా విరాళాలు అందజేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అందుకే ప్రతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం కోట్లలోనే వస్తూ ఉంటుంది. మొన్నటివరకు కరోనా వైరస్ కారణంగా భక్తుల దర్శన సంఖ్యను తగ్గించింది టిటిడి బోర్డు. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తూ ఉండడం గమనార్హం. దీంతో ఎంతో మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తరలి వెళ్తున్నారు. ఇక ఇటీవలే శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగి పోయిందని టిటిడి బోర్డు ప్రకటించింది.


 వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు పది రోజుల పాటు తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువ అయినట్టు టిటిడి బోర్డు తెలిపింది. దాదాపు 3.79 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. కాగా ఇక ఈ 10 రోజుల లో హుండీ ఆదాయం 26.61 కోట్ల రూపాయలు  వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో ఇంత భారీ మొత్తంలోహుండీ ఆదాయం రావడం మాత్రం మొదటి సారి అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd