తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ఎందరో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమాలు చేసి ఉన్నారు. కానీ చాలా మందికి వారెవరో కూడా తెలియదు. అలాంటి కొద్ది మందిలో అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ ఒకరు కావడం స్త్రీ జాతికి గర్వకారణం. అల్లం పద్మ ఎక్కువగా చివరి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. అంతే కాకుండా మహిళా జేఏసీ లో ప్రభావ వంతంగా పనిచేశారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కన్న బిడ్డలుగా చూసుకుని పద్మక్కగా పేరు గాంచారు. అలా ఎంతో మంచి పేరును సంపాదించుకున్న పద్మక్కకు కిడ్నీ సంబంధిత వ్యాధి సోకింది.

అయితే తాను చేసిన పుణ్యాల వలన కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవితాన్ని గడుపుకుని వచ్చింది.  అయితే గత 20 రోజుల నుండి పరిస్థితి చెయ్యి జారడంతో హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్సను తీసుకుంటున్నారు. అలా ఇక ఈ లోకంతో పని లేదని తన బిడ్డలను అందరినీ అనాధలుగా చేసి ఆ దేవుని దగ్గరకు వెళ్ళిపోయింది. ఈమె మరణాన్ని జీర్ణించుకోలేక ఎందరో తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈమె పార్థివ దేహాన్ని ప్రజల కోసం ఎర్రగడ్డ కాలనీలో ఉంచి, ఆ తర్వాత మధ్యాహ్నం జూబిలీ హిల్స్ లోని మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుపనున్నారు. ఈమె మృతిని తెలుసుకునే తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు.

గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడానికి పద్మక్క చేసిన సేవలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు. ఈమె మృతికి తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మరియు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రశాంత్ రెడ్డి లాంటి పలువురు సంతాపాన్ని తెలిపారు. ఈమె మృతికి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు కూడా దిగ్బ్రాంతికి గురి అయ్యాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతో మందికి అన్నం పెట్టి అన్నపూర్ణమ్మ అయింది. నేడు వారంతా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బాధ పడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: