
అయితే ఈ విషయం ఎలాగోలా పెద్దది కాకుండా అందరూ మరిచిపోయారు... గోరంట్ల మాధవ్ కూడా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో వివాదంలో ఇరుక్కున్నారు. ప్రస్తుతం తాను నివాసం ఉంటున్న ఇల్లు తన సొంతం కాదని తెలిసిందే. అయితే ఈ ఇంటి ఓనర్ మల్లికార్జున్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గోరంట్ల మాధవ్ ఆ ఇంటికి సంబంధించిన రెంట్ మరియు కరెంటు బిల్లులు కట్టలేదని తెలుస్తోంది. వీటి తాలూకు డబ్బులు రెండు లక్షల రూపాయల వరకు పెండింగ్ లో ఉందట. అయితే మల్లికార్జున్ రెడ్డి ఆ డబ్బులు చెల్లించాలని అడిగినా ఇవ్వకపోగా తనను తన అనుచరుల ట్రిప్పర్ తో తొక్కిస్తానని బెదిరిస్తున్నాడట.
ఈ విషయంలో న్యాయం చెయ్యాలని ఇంటి ఓనర్ మల్లికార్జున్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడట. కానీ పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరితో మాట్లాడాలని ప్రయత్నించినా మొదటిసారి సఫలం కాలేదని తెలుస్తోంది. పోలీసులు మరోసారి ఇద్దరితో మాట్లాడి ఈ అంశాన్ని పరిష్కరించాలని అనుకుంటున్నారట. ఇంటి ఓనర్ మల్లికార్జున్ రెడ్డి ఈ పెండింగ్ అమౌంట్ పే చేసిన తర్వాత ఇంటిని ఖాళీ చెయ్యాలని కూడా చెప్పాడట. ఈ వార్త తెలిసన పలువురు అదేంటి ఎంపీ గా ఉండి సొంత ఇల్లు లేకపోవడం ? రెంట్ ఇల్లు ఉన్న అద్దె కట్టకపోవడం ఏంటి అంటూ అవాక్కవుతున్నారట.