ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కూల్చివేత ఆరోపణలపై హైకోర్టు అక్షింతలు వేసినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బుద్ధి వచ్చినట్లులేదు. ఈనెల 27వ తేదీన ఇప్పటానికి పవన్ వెళుతున్నారు. మొన్నచేసిన రచ్చ సరిపోలేదేమో మళ్ళీ వెళుతున్నారు. ఇప్పటం గ్రామంలో అక్రమనిర్మాణాల కూల్చివేత విషయంలో ప్రభుత్వ వాదననే కోర్టు సమర్ధించింది.

ఇళ్ళు కూల్చివేతపై గ్రామస్తులు కొందరు కోర్టులో కేసువేశారు. తమ ఇళ్ళని ప్రభుత్వం అన్యాయంగా కూల్చేసిందని, జనసేన ఆవిర్భావ సభకు స్ధలం ఇచ్చామన్న అక్కసుతో వేధింపులకు దిగిందంటు పొలిటికల్ కలరింగ్ ఇచ్చారు. దాంతో విషయం కాస్త బాగా వివాదాస్పదమైపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాతరలో పోతురాజు లాగ నానా గోలచేశారు. పవన్ కు చంద్రబాబునాయుడు, సీపీఎం పార్టీల నేతలు వంతపాడారు. నోటీసులివ్వకుండానే ఇళ్ళని ఎలా కూలుస్తారంటు పవన్, చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

తీరా కేసు విచారణలో అసలు విషయం బయటపడింది. రోడ్డును ఆక్రమించుకుని నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు ఇళ్ళ యజమానులకు నోటీసులు ఇచ్చిన విషయం వెలుగుచూసింది. ప్రభుత్వం నోటీసులిచ్చింది వాస్తవమే అని పిటీషనర్ల తరపు లాయరే అంగీకరించారు. ప్రభుత్వం నోటీసులిచ్చినా ఇళ్ళ యజమానులు పట్టించుకోలేదన్న విషయం కూడా తెలిసిపోయింది. దాంతో కోర్టే పిటీషనర్లపై మండిపోయింది. చివరకు కోర్టు ఆదేశాలు  ఎల్లోబ్యాచ్ కు షాకిచ్చినట్లయ్యింది.


నోటీసులు ఇవ్వకుండానే ఇళ్ళని కూల్చేస్తోందని చెప్పి కోర్టును తప్పుదోవపట్టించిన పిటీషనర్లపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పమని లాయర్ను నిలదీసింది. ఇళ్ళకూల్చివేతలపై గతంలో ఇచ్చిన స్టేని కోర్టు ఎత్తేసింది.  పిటీషనర్లపై కోర్టు ఏమిచర్యలు తీసుకుంటుందనేది వేరే విషయం.


మరి పిటీషనర్ల లాగే మొత్తం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన ఎల్లోబ్యాచ్ పై ఏమి చర్యలు తీసుకోవాలి ? ఇప్పటం గ్రామం కేంద్రంగా మొత్తం ఎల్లోబ్యాచ్ చేసిందంతా ఓవర్ యాక్షనే అని కోర్టు విచారణలోనే బయడపటింది. రోడ్డును ఆక్రమించి చేసిన నిర్మాణాలను అధికారులు కూల్చేస్తే ఏకంగా ఇళ్ళనే కూల్చేసినట్లుగా గోలగోల చేసింది ఎల్లోబ్యాచ్. ఇందుకనే ఎల్లోబ్యాచ్ జనాల్లో ఎల్లోబ్యాచ్ నమ్మకం కోల్పోయింది. కోర్టు తాజా వ్యాఖ్యల నేపధ్యంలో ఈనెల 27వ తేదీన పవన్ పెట్టుకున్న ఇప్పటం పర్యటన ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: