ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందా ? ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీచేసింది. కేఆర్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నదని ప్రచారం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే నాలుగు రోజుల క్రితం కేఆర్ నాయకత్వంలో కొందరు ఉద్యోగులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు.






ఎందుకు కలిశారంటే ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయటానికి. ప్రతినెలా ఒకటవ తేదీనే జీతాలు ఇచ్చేట్లుగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. అంతేకాకుండా 1వ తేదీన జీతాలిచ్చేట్లుగా చట్టం చేయించాలని కూడా విజ్ఞప్తిచేశారు. డీఏ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం తమను ఇబ్బందులు పెడుతోందని ఫిర్యాదుచేశారు. గవర్నర్ తో ఫిర్యాదులు చేసిన తర్వాత కేఆర్ ఈ విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఉద్యోగసంఘం అధ్యక్షుడు గవర్నర్ కు చేసిన ఫిర్యాదును ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకుని ప్రభుత్వాన్ని ఏకిపారేశాయి.





కేఆర్ ఫిర్యాదు, ప్రతిపక్షాలు ఏకిపారేయటంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటు ప్రభుత్వంపైనే గవర్నర్ కు కేఆర్ ఫిర్యాదు చేయటం తప్పు. తమ సమస్యలు ఏవైనా ఉంటే తాము పనిచేస్తున్న శాఖల అధిపతులతోనో లేకపోతే ఫైనాన్స్, రెవిన్యు శాఖల అధిపతులతోనో మాట్లాడుకోవాలి. అవసరాన్ని బట్టి మంత్రులు లేదా సీఎంను కలిసి మాట్లాడటంలో కూడా  తప్పులేదు. 





సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగసంఘాలు సమ్మెలు చేసిన ఘటనలు కూడా అందరికీ తెలిసిందే. తమకు అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ వదిలేసి కేఆర్ ఏకంగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదుచేయటం సంచలనంగా మారింది. సో, షోకాజ్ నోటీసుకు కేఆర్ ఇచ్చిన రిప్లైతో ప్రభుత్వ కన్వీన్స్ కాకపోతే యాక్షన్ తీసుకోవటం ఖాయం. బహుశా ఉద్యోగ సంఘం గుర్తింపును రద్దుచేయటమో లేకపోతే కేఆర్ పై డిసిప్లిన్ యాక్షన్ తీసుకునే అవకాశముందని సమాచారం. ప్రతిపక్షాలు ఆడించినట్లు కేఆర్ ఆడుతున్నట్లు ప్రభుత్వం నిర్ధారణకొచ్చింది. అందుకనే కేఆర్ పై కచ్చితంగా యాక్షన్ ఉంటుందని అనుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: