తెలుగుదేశంపార్టీ, జనసేన పార్టీల నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ఇప్పటం గ్రామంలో ఆక్రమించి కట్టుకున్న ఇళ్ళప్రహరిగోడల కూల్చివేతలను తొలగించటాన్ని కూడా అడ్డుకుంటున్నారు. శనివారం ఆక్రమణల తొలగింపుకు గ్రామంలో పనులు మొదలుపెట్టగానే పై పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున గోల చేశారు. పైగా వీళ్ళకి ఎల్లోమీడియా యథాశక్తి సహకరించి రచ్చరచ్చ చేసింది. ఇళ్ళ ప్రహరిగోడలను తొలగిస్తుంటే ఏకంగా ఇళ్ళనే కూల్చేస్తున్నారంటు గోల చేయటమే విచిత్రంగా ఉంది.





ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇలాంటి గొడవ గతంలో కూడా జరిగింది. అప్పట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతటి సీన్ చేశారో అందరికీ తెలిసిందే. కూల్చివేతలపై స్ధానికుల తరపున జనసేన కోర్టులో కేసువేసింది. కేసును విచారించిన కోర్టు ఆక్రమణలు నిజమే అని, నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు మొదలుపెట్టిందని నిర్ధారణ చేసుకున్నది. ముందు ఆక్రమణలు తప్పన్నారు. తర్వాత నోటీసులే ఇవ్వలేదని బుకాయించారు. అయితే గ్రామస్తుల వాదనే తప్పని అధికారులు నిరూపించారు. దాంతో ఆక్రమణలు, నోటీసులిచ్చింది నిజమే అని ఇళ్ళసొంతదారులు అంగీకరించారు.





దాంతో కోర్టునే తప్పుదోవ పట్టించారని మండిపోయి 14 మందికి  తలా లక్షరూపాయలు ఫైన్ వేసింది. దాంతో అప్పుడు పవన్ ఏమీ మాట్లాడలేకపోయారు. అప్పట్లో కోర్టు కేసు కారణంగా గ్యాప్ వచ్చిన కూల్చివేతలను ఇపుడు ప్రభుత్వం మొదలుపెట్టింది. దాంతో జనసేన, టీడీపీ నేతలు మళ్ళీ గోల మొదలుపెట్టారు. పై పార్టీల నేతలు, ఎల్లోమీడియా మళ్ళీ పాత గోలే మొదలుపెట్టారు.





ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించి కట్టుకున్న ఇళ్ళ ప్రహరిగోడలను మాత్రమే కూలుస్తున్నారు. ఎల్లోమీడియాలో అయితే బ్యానర్ హెడ్డింగుల్లో కూల్చివేతలని పెట్టి లోపలేమో  ప్రహరిగోడలను కూల్చేస్తున్నారని చిన్నదిగా రాస్తున్నారు. అంటే తాము రాస్తున్నది తప్పుడు రాతలను ఎల్లోమీడియాకే బాగా తెలుసు. ఒకపుడు కోర్టును తప్పుదోవ పట్టించినట్లే ఇపుడు కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్లున్నారు. ఎవరైనా కోర్టుకెళితే మళ్ళీ పాత అనుభవమే ఎదురవటం ఖాయం. ఇంతోటిదానికి కోర్టును, బయటజనాలను ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా తప్పుదోవ పట్టించటం అవసరమా ?

మరింత సమాచారం తెలుసుకోండి: