అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా సీబీఐతో పాటు ఎల్లోమీడియాకు హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ ఊహించని షాకిచ్చారు. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ కు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ వాదించింది. కోర్టులో సీబీఐ లాయర్ వాదిస్తే బయట ఎల్లోమీడియా అవినాష్ కు వ్యతిరేకంగా పదేపదే రెచ్చిపోయింది. ఎట్టి పరిస్ధితుల్లో అవినాష్ కు బెయిల్ రాకూడదన్నది ఎల్లోమీడియా పట్టుదల.

అయితే 26వ తేదీ విచారణ సందర్భంగా అవినాష్ కు తాత్కాలిక బెయిల్ ఇవ్వటాన్ని ఎల్లోమీడియా జీర్ణించుకోలేకపోయింది. తాత్కాలిక బెయిల్ ఇచ్చిన జడ్జిపై ఎల్లోమీడియా విషం కక్కేసింది. అవినాష్ దగ్గర డబ్బులమూటలు తీసుకుని జడ్జి తాత్కాలిక బెయిల్ ఇచ్చారని ఏబీఎన్ ఛానల్లో సస్పెన్షన్లో ఉన్న వివాదాస్పద జడ్జి రామకృష్ణ ఆరోపించారు. ఇదే ఆరోపణను తానుచేస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశ్యంతో ఛానలే రామకృష్ణ ద్వారా ఆరోపణలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఎల్లోమీడియా పూర్తిగా డిఫెన్సులో పడిపోయింది. 

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే 31వ తేదీ జరిగిన విచారణలో అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇచ్చారు. బెయిల్ తీర్పు ఇచ్చేసమయంలో జడ్జి ఎల్లోమీడియా మీద తీవ్రమైన వ్యాఖ్యలుచేశారు. డబ్బులమూటలు తీసుకుని తాను తాత్కాలిక బెయిల్ ఇచ్చానని చెప్పటమంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే అంటు మండిపోయారు. ఏబీఎన్, మహాన్యూస్ లో తనపై వచ్చిన ఆరోపణలు వ్యక్తిగతంగా తనపై వచ్చినవి కావని యావత్ న్యాయవ్యవస్ధపైన చేసిన ఆరోపణగా చెప్పారు.

ఆరోపణలుచేసిన మీడియాపై చర్యలు తీసుకోవాలని జడ్జి ఏకంగా తీర్పుకాపీలోనే రికార్డుచేయటం సంచలనంగా మారింది.  అవినాష్ కు బెయిలిచ్చి సీబీఐకి, తనపై ఆరోపణలు చేసిన ఎల్లోమీడియాపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదుచేయటం ద్వారా ఎల్లోమీడియా యాజమాన్యాలకు షాకిచ్చారు. దాంతో భయపడిన ఎల్లోమీడియాలో ఒకటైన మహాన్యూస్ వెంటనే హైకోర్టుకు క్షమాపణలు చెప్పుకున్నది. అయితే అదికూడా ఏదో తప్పదుకాబట్టే క్షమాపణలు చెప్పినట్లుంది. మరి జడ్జి ఫిర్యాదుపై చీఫ్ జస్టిస్ ఏమి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిందే.మరింత సమాచారం తెలుసుకోండి: