రాబోయే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎంఎల్ఏలు 11 మందిని కొత్త నియోజకవర్గాలకు కేటాయించారు. ఇంకా కొంతమందికి నియోజకవర్గాలను మార్చబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయని, జగన్ మీద తిరుగుబాటు లేవటమే ఆలస్యమన్నట్లుగా ఎల్లోమీడియా పదేపదే వార్తలు అచ్చేస్తోంది. ఒకవిధంగా జగన్ పైన మంత్రులు, ఎంఎల్ఏలను ఎల్లోమీడియా రెచ్చగొడుతోంది.
జగన్ చేసిన పనితో విభేదిస్తున్న మంత్రులు లేదా ఎంఎల్ఏలు పక్కచూపులు చూస్తున్నారని కథనాలు ఇస్తున్నది. పక్కచూపులు అంటే టీడీపీ, జనసేన లేదా ఇతర పార్టీల్లో చేరుతారన్నట్లుగా ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది. అయితే తాజాగా మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతు వైసీపీలోని అసంతృప్తులకు పెద్ద షాకే ఇచ్చారు. ఎలాగంటే వైసీపీలో టికెట్లు దక్కనివాళ్ళు, అసంతృప్తులు తమకు అవసరంలేదన్నారు. వైసీపీ తరపున గెలవని ఎంఎల్ఏలు తమకు మాత్రం ఎందుకని ప్రశ్నించారు. వైసీపీలోని గట్టినేతలు ఎవరైనా ఉంటే వాళ్ళని పార్టీలోకి తీసుకునే విషయాన్ని ఆలోచిస్తామని బంపరాఫర్ ఇచ్చారు.
పైగా ఒక చోట చెల్లని కాసులు మరోచోట చెల్లుతుందా అని సెటైర్ కూడా వేశారు. ఇక్కడే చందబాబుదంతా గురివింద గింజనీతని తేలిపోయింది. అధికారులకు బదిలీలుంటాయి కానీ మంత్రులు, ఎంఎల్ఏలకు కూడా ట్రాన్స్ ఫర్లుంటాయని ఇపుడే చూస్తున్నానని ఎద్దేవాచేశారు. 2019 ఎన్నికల్లో తాను ఏమిచేశారనే విషయాన్ని చంద్రబాబు కన్వీనియంట్ గా మర్చిపోయినట్లు నటిస్తున్నారు. పాయకరావుపేట ఎంఎల్ఏ వంగలపూడి అనితను కొవ్వూరుకు బదిలీచేశారు. కొవ్వూరులోని కేఎస్ జవహర్ ను తిరువూరుకు బదిలీచేశారు. కృష్ణాజిల్లా నేత వర్ల రామయ్యను 2009లో తిరుపతి ఎంపీగా పోటీచేయించిన విషయం మరచిపోయారా ?
సరే విషయం ఏదైనా జగన్ చర్యలతో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు టీడీపీ వైపు చూసే అవకాశం లేకుండాపోయింది. వైసీపీ అసంతృప్తులకు, టికెట్లు రాని వాళ్ళకు తమ పార్టీలో చోటులేదని స్పష్టంగా ప్రకటించేశారు. దాంతో సీటుమారటం ఇష్టంలేని వాళ్ళు, టికెట్ రాదని కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు టీడీపీలోకి వెళదామని ఆలోచిస్తారనటంలో సందేహంలేదు. అలాంటి వాళ్ళకి చంద్రబాబు గేట్లు మూసేసినట్లయ్యింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి