ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల హడావిడి అప్పుడే రాజుకుంది. ముఖ్యంగా గెలుపు పైన ప్రధాన పార్టీలు సైతం ఎక్కువగా ఫోకస్ పెడుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు.. ఈ సమయంలోనే పలు రకాల సర్వేలు సైతం రంగంలోకి దిగి ప్రజల యొక్క పల్స్ తెలుసుకొనీ ఆంధ్రాలో అధికారం ఎవరిదో తేల్చేస్తూ అంతేకాకుండా జిల్లాల వైజ్ గా కూడా పలు రకాల అంచనాలను కూడా తెలియజేస్తున్నారు.. ఈ అంచనా ప్రకారం అటు రాయలసీమలో ఈసారి ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయని విషయం పైన కూడా వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈసారి జనసేన టిడిపి బిజెపి కూటమితో వైసిపి పార్టీని ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ఈసారి ఎవరు గెలుస్తారనే విషయం పైన చాలామంది రాజకీయ నాయకులు ప్రజలు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.. తాజాగా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఆంధ్ర ప్రదేశ్ లోని ఎన్నికల పైన తమ అంచనాలను సైతం తెలియజేశారు.. అయితే ఇందులో తెలిపిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి ఓటు శాతం..48.5% ఉన్నదని అంచనా వేసింది.. అయితే కూటమిలో 46.5% శాతం మాత్రం ఉంటుందని ఇతరులకు మూడు శాతం.. మిగిలిన రెండు శాతం ఎవరు ఎవరికి ఓటు వేస్తారో చెప్పలేమని తెలియజేశారు.


ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో విషయానికి వస్తే అనంతపూర్ లో వైసీపీ-7.. కూటమి 3స్థానలలో గట్టి పోటీ ఉంటుందని వెల్లడించారు.. చిత్తూరు జిల్లాలో వైసీపీ-10 సీట్లు గెలుస్తుందనీ.. మరో 3 సీట్లలో కూటమి గెలుస్తుందని ఈ సంస్థ తెలియజేసింది.. కడపలో వైసిపి -8 కూటమి ఒక స్థానంలో గట్టి పోటీ ఉంటుందని అలాగే కర్నూలులో వైసిపి 10 కూటమి మరో 3 స్థానంలో చాలా హోరాహోరీగా ఉంటుందని వెల్లడించారు.. అన్ని జిల్లాల సర్వేల ప్రకారం కూటమి 50 స్థానాలలో.. వైసీపీ 93 స్థానాల్లో అత్యధికంగా ఉంటుందని విశ్లేషించారు. మరో 32 స్థానాలలో చాలా హోర హోరిగానే పోటీ ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: