ప్రచారంలో హామీలు ఇచ్చి ఓటరు మహాశయులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా నాయకులు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలా ప్రచారానికి వెళ్లిన నాయకులకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఏకంగా ఓటర్లే ప్రచారం చేయనివ్వకుండా అడ్డుకోవడం..  ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ మొఖం పట్టుకుని అడగడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అటు ఏపీలో ప్రచారంలోకి వెళ్తున్న అధికార వైసీపీ అభ్యర్థులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి.


 మాకేం చేసారు.. ఏం అభివృద్ధి జరిగిందో చూపించండి అంటూ ఎంతోమంది నాయకులను ప్రజల ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భారీగా ఖర్చుపెట్టి బస్సుల్లో జనాలను ప్రచారం కోసం  తరలిస్తున్న.. ముఖ్య నేతల ప్రసంగం ముగిసే వరకు కూడా జనాలు ఉండకపోవడం గమనార్హం. ఇక ఇటీవల ఏకంగా వైసీపీలో కీలకనేతగా సీఎం జగన్కు నమ్మినబంటుగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ఇటీవల ప్రచారానికి వెళ్లిన ఆయనకు ఘోర అవమానం జరిగింది ఏకంగా విజయసాయిరెడ్డి ప్రసంగం మొదలుపెట్టక ముందే అక్కడికి వచ్చిన జనాలు అందరూ కూడా  వెళ్లిపోవడం మొదలుపెట్టారు. దీంతో ఇలా వెళ్ళిపోతున్న జనాలను ఆగండి ఆగండి వెళ్ళకండి అంటూ బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం లో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి ఇలాంటి చేదు ఎదురైంది. సీతారామపురంలో ప్రచార రథం పై ప్రసంగిస్తుండగా జనం ఒక్కసారిగా లేచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ పార్టీ కార్యకర్తలు సైతం ప్రసంగం సమయంలో ఇంటి బాట పట్టడం గమనార్హం. ఇక దీనిని గమనించిన వైసీపీ నేతలు వెళ్ళవద్దు ఆగండి ఇంకా పెద్దాయన మాట్లాడలేదు.. భోజనాలు కూడా ఉన్నాయి ఆగండి అంటూ జనాలను బ్రతిమిలాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది విజయసాయి లాంటి నేతకు నిజంగా ఘోర అవమానమే అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారట. ఇప్పుడు మాటే వినట్లేదు రేపు ఈ జనాలు ఓట్లు వేస్తారా అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap