తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్య లక్షంగా దాదాపు 23 సంవత్సరాల క్రితం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అనే పార్టీని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ పార్టీ ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగింది. అందులో భాగంగా ఎన్నో పోరాటాలను చేసి తెలంగాణ ప్రజల్లో ఈ పార్టీ మంచి స్థానాన్ని దక్కించుకుంది.

అందులో భాగంగా వీరు చేసిన పోరాటాల ఫలితం అలాగే జనాలు వీరి పోరాటాలకు అండదండగా నిలవడంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ భారీ మొత్తంలో అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని తెలంగాణలో గవర్నమెంటును ఫామ్ చేసింది. ఇక ఆ తర్వాత 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీని తెచ్చుకొని రెండవ సారి కూడా తెలంగాణ లో అధికారం లోకి వచ్చింది.

ఇకపోతే ఆ తర్వాత కేసీఆర్ ఇది కేవలం ప్రాంతీయ పార్టీగా ఉండడం మంచిది కాదు. దీని భావాలు ... ఉద్దేశాలు జాతీయ స్థాయివి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని భారతీయ రాష్ట్ర సమితి గా మార్చేశాడు. ఇకపోతే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దానితో "బి ఆర్ ఎస్" ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా తెలంగాణ లో ఉంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంది.

అందులో భాగంగా నీళ్లందక ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి , కరువుతో అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల మార్చి 31 న జనగామ , సూర్యాపేట , నల్గొండ జిల్లాల్లో కెసిఆర్ పర్యటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: