ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీజేపీ రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి తప్పిస్తే పెద్దగా సీట్లను కూడా దక్కించుకోలేకపోయింది. దానితో ఈసారి ఎలాగైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవాలి అని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అందులో భాగంగా ఒంటరిగా పోటీలోకి దిగకుండా రాష్ట్రంలో మంచి పట్టు ఉన్నటువంటి టీడీపీ, జనసేన లతో పోత్తులో భాగంగా పోటీలోకి దిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా పని చేస్తున్న పురందరేశ్వరి గెలుపు కూడా కీలకంగా మారింది. ఎందుకు అంటే ఈమె గెలిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కి గట్టిపట్టు ఉంది అని ఈ పార్టీ చెప్పుకోగలుగుతుంది. దానితో ఈమె తన గెలుపు గురించి ఎంతగానో కృషి చేస్తుంది. ఈమె రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలోకి దిగబోతుంది. రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.

రాజమండ్రి సిటీ , రూరల్ , ఆనపర్తి , రాజానగరం , కోవ్వూరు , నిడదవోలు , గోపాలపురం స్థానాలు ఉన్నాయి. రాజమండ్రి లోక్‌సభకు మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా పోటీలోకి దిగబోతున్న పురంధరేశ్వరి గెలుపు పక్కాగా కనపడుతుంది. ఎందుకు అంటే ఈ ప్రాంతం నుండి వైసీపీ అభ్యర్థిగా డా.గూడూరి శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పీసీసీ మాజీ ప్రెసి డెంట్‌ , మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పోటీలో ఉన్నారు.

వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌ రాజకీయాలకు కొత్త దానితో ఈయనకు రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తుల గురించి పెద్దగా తెలియదు. అలాగే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎంపీ సీటు గురించి పెద్దగా పట్టించుకోకుండా తమ గెలుపు కోసం మాత్రమే ఎక్కువగా కృషి చేస్తున్నారు. అది ఈయనకు మైనస్ గా మారే అవకాశం చాలా వరకు ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గిడుగు రుద్రరాజు కూడా ఇక్కడ పెద్దగా ప్రభావం చూపడం లేదు. దానితో రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని అవలీలగా పురందరేశ్వరి గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: