గత ఎన్నికలలో చూస్తే మహిళలు, పురుషులు, చదువుకున్న వారు, చదువు లేని వారు ,గ్రామీణ పట్టణం ఉద్యోగులు నిరుద్యోగులు ఇతరత్రా అందరూ కూడా ఎవరికి వారు తమ ఓటు వేస్తామంటూ తెలియజేశారు. ఒకవేళ అలాంటివారు వేయకపోతే ఎలా వేయించుకోవాలి అన్న విషయం మీద రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచించి పలు రకాల హామీలు ఇస్తూ వారిని అట్రాక్షన్ చేసేలా కనిపిస్తున్నారు. కానీ 2019 ఎన్నికల తర్వాత చూస్తే పూర్తిగా మారిపోయింది.. మరో కొత్త సెక్షన్ పుట్టుకు వచ్చింది. ఆ సెక్షన్ పేరే తాగుబోతుల సెక్షన్..


విరు కూడా ఈసారి ఎన్నికలలో చాలా తీవ్రమైన ప్రభావం చూపించేలా కనిపిస్తున్నారు. ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒకప్పుడు చెప్పినప్పటికీ 1955 ఎన్నికల నుంచి ఈ హామీ ఎవరు అమలు చేయలేకపోయారు. 1994లో సంపూర్ణ మద్యపాన నిషేధమని నినాదాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కానీ 8 నెలలకే ఆయన పార్టీని చంద్రబాబు అంటి వారు కూల్చివేసి అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు.


అప్పటినుంచి ఇప్పటిదాకా ఎవరు కూడా మళ్లీ ఈ నినాదాన్ని అమలు చేయడానికి సాహసం చేయలేకపోతున్నారు. అయితే 2019లో దశలవారీగా వీటిని మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తారని జగన్ హయాంలో చెప్పినప్పటికీ. పల్లెలలో మాఫీ అయినప్పటికీ ఇతర ప్రాంతాలలో చేయలేకపోయారు. ముఖ్యంగా కల్తీ మద్యం అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు సైతం ఎద్దేవా చేస్తూ విమర్శిస్తూ ఉన్నారు. అంతేకాదు లిక్కర్ దారుణమైన బ్రాండ్లను పెట్టి అధిక ధరలకు అమ్ముతూ ఉండటం వల్ల చాలామంది ఈ మందు తాగి మరణిస్తున్నారు అనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి అధికారంలోకి వస్తే  చంద్రబాబు కూడా నాణ్యమైన మందుని సప్లై చేస్తామంటూ అది కూడా చౌక ధరలకే అందిస్తామంటూ వెల్లడిస్తున్నారు. ఈసారి మద్యం తాగే ఓటర్ల సంఖ్య 4% ఉన్నట్లుగా లెక్క కనపడుతోంది వీటి ఓట్ల కోసమే చంద్రబాబు ఇలాంటి హామీ ఇచ్చారని తెలుస్తోంది. వీరి ఓట్లు పోయిన మహిళల ఓట్లు మాత్రం తమకే అంటూ వైసీపీ పార్టీ చాలా ధీమాతో ఉన్నారు. మొత్తానికి చూస్తే తాగుబోతు ఓటర్లందరూ ఇతర ఓట్లు వేరయా అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: