టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తన భర్త ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా కూడా పెద్దగా ఈమె మాత్రం రాజకీయాలపై అందుకు సంబంధించిన పనులకు చాలా దూరంగానే ఉండేది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు నేను పాల్గొనే ఆఖరి ఎలక్షన్స్ అని చెప్పడం , అలాగే వైసీపీ పార్టీ తమపై , తమ కుటుంబాన్ని పై అనేక ఆరోపణలు చేస్తుంది. అలాగే ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించి జైల్లో ఉంచారు.

మరియు రాష్ట్రాన్ని  రాష్ట్ర ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి పార్టీ పరిపాలన ప్రజలకు అక్కర్లేదు. ఆ పార్టీ పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగించేందుకు నేను కూడా రంగంలోకి దిగి నా వంతు సహాయం చేస్తాను అని ఈమె కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా నిలబడింది. ఇక భువనేశ్వరి గారు కూడా వైసీపీ పై తనదైన స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఈమె ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా వైసీపీ అరాచకాలను అంతమొందించడానికి... రాష్ట్రాన్ని , ప్రజలను రక్షించుకోవడానికి ఈ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులందరూ ప్రజాక్షేత్రంలోకి రాక తప్పడం లేదని భువనేశ్వరి అన్నారు.

అలాగే నారా లోకేష్ యువగళం పాదయాత్ర , చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత తాను చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం , ఇప్పుడు ఎన్నికల్లో చంద్రబాబు కూటమితో కలిసి చేపట్టిన ప్రజాగళం కార్యక్రమాల ద్వారా పార్టీకి మంచి ఫలితాలు రానున్నట్లు ఆమె తెలిపింది. నారా కుటుంబానికి , నందమూరి కుటుంబం నుంచి కూడా ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు లభించబోతున్నట్లు భువనేశ్వరి తెలియజేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి , ప్రజలను కలుషితం చేసే సంస్కృతికి ఒడి కట్టడం ఎంతో బాధాకరమన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తుందని  ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం ఖాయమని భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nb