ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముగిసి ఇప్పటికి 10 రోజులపైనే కావస్తోంది. వచ్చే నెల నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని తెలియజేస్తున్నాయి. అయితే కూటమి కూడా తమ లెక్కలతో తాము అధికారంలోకి వస్తామనే విధంగా తెలియజేస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న వైసిపి నేత vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి తాజాగా చంద్రబాబు నాయుడు పైన సెటైరికల్ కామెంట్స్ చేశారు. వాటి గురించి చూద్దాం.ట్విట్టర్ వేదికగా vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి ఇలా స్పందిస్తూ.. చంద్రబాబు పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు.. 2019 ఎన్నికలలో వచ్చింది మీకు 23 స్థానాలు.. ఈసారి మా వాళ్లను.. నలుగురిని కొన్నావు జూన్ 4వ తేదీన కౌంటింగ్ రాబోతోంది. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అంటు  ట్వీట్ చేశారు.ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితమవుతావని తెలిసి నీ మీద జాలేస్తోంది అంటూ విజయసాయిరెడ్డి కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు.ఈనెల 13వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ జరిగింది. తుది ఫలితాలు వచ్చే నెల నాలుగవ తేదీన విడుదల కాబోతున్నాయి. దీంతో గెలుపు మాదే అంటే మాదే అంటే అటు వైసిపి, టిడిపి నేతలు చాలా ధీమాతో ఉన్నారు. దీంతో ఏపీలో పలుచోట్ల అల్లర్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పోలీసులు 144 సెక్షన్ ని కూడా అమలు చేశారు. కౌంటింగ్ సమయానికి కూడా ఎలాంటి గొడవలు ఉండకుండా ఉండేందుకు అధికారులు సైతం పలు రకాల నిర్ణయాలను తీసుకుంటున్నారు. పార్టీ అధినేతలు సైతం ఇతర ప్రాంతాలలో రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న విజయ సాయి రెడ్డి చంద్రబాబుకు దిమ్మతిరిగే ట్వీట్ ఇచ్చారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: