ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు.. ముగిసిన నేపథ్యంలో అందరూ వాటి ఫలితాలపై ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఈ ఫలితాలు వస్తాయా... ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా? రిజల్ట్   రోజున ఏం జరుగుతుందో అని  ఏపీ ప్రజలందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఫలితాలు రాకముందే తెలుగు తమ్ముళ్లు.... అయితే మంత్రి పదవులను కూడా పంచుకుంటున్నారు.
 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని స్పష్టం చేస్తున్నారు. అలాగే తాజాగా.. ఏపీలో  మంచి పలుకుబడి రాజకీయ నాయకుడు రఘురామకృష్ణ రాజుకు... హోం మంత్రి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆయన పర్సనాలిటీకి... కచ్చితంగా హోం మంత్రి వస్తుందని... ఆయన హోం మంత్రి అయితే... వైసిపి పార్టీకి చుక్కలు చూపిస్తారని అభిప్రాయపడుతున్నారు.

 

వైసిపి అధికారంలో మిమ్మల్ని రోజులు రఘురామకృష్ణ రాజుకు  ఇబ్బందులు తప్పలేదు.  ఒకానొక సమయంలో రఘు రామకృష్ణ రాజుని అరెస్టు చేసిన సిఐడి పోలీసులు... అతనిపై లాటిచార్జి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రిగా రఘురామకృష్ణ రాజుకు చాన్స్ ఇవ్వాలని కూడా తెలుపుతమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు.  ఆయన హోం మంత్రి అయితే... ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.

 

అయితే చంద్రబాబు మాత్రం ఆయనకు హోం మంత్రి పరిస్థితి లేదని చెబుతున్నారట. ర ఘు రామ కృష్ణ కు హోం శాఖ  మంత్రి ఇస్తే... తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు  ప్రాధాన్యత తగ్గుతుంది. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా... వైసీపీలో కొడాలి నాని  తరహాలో పాత్రను అప్పగించేందుకు సిద్ధమవుతున్నారట. కేవలం మీడియా ముందుకు వెళ్లి...  జగన్కు వ్యతిరేకంగా మాట్లాడేలా రఘురామకృష్ణ రాజును సిద్ధం చేస్తున్నారట. నిత్యం ప్రెస్మీట్ పెట్టి..జగన్ మోహన్ రెడ్డి తిట్టేలా  రఘురామకృష్ణ రాజును వాడబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: