( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )

అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడున్న పరిస్థితులలో వైసిపి పుంజుకోవటం కష్టం అని భావించిన ఆ పార్టీకి చెందిన నేతలు ... గత ఎన్నికలలో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారందరూ ఇప్పుడు తెలుగుదేశం - జనసేన వైపు చూస్తున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల నుంచి గత ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కరణం వెంకటేష్ ఆయన తనయుడు ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం ఇద్దరు ఇప్పుడు టిడిపి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా కరణం ఫ్యామిలీని టిడిపిలోకి తీసుకునేందుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు ఎంత మాత్రం ఇష్టం ఉండదు.


అయితే కరణం తాను పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ విజయవాడకు చెందిన విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే .. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ద్వారా టిడిపి లోకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం గతంలో టిడిపి నుంచి పోటీచేసి వైసీపీలోకి వెళ్లినవారు. ఈ క్రమంలో ఆమె కూడా వైసీపీలో తనకు భవిష్యత్తు లేదని ఇప్పుడు తిరిగి టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.


చీరాలలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ సైతం ఈ ఎన్నికలలో వైసిపి సీటు ద‌క్కక కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 40 వేల పై చిలుకు ఓట్లు తెచ్చుకొని తన పట్టు నిలుపుకున్నారు. ఆయన కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీని వీడి జనసేనలోకి వెళతారా ? అన్న చర్చ‌ అయితే జరుగుతోంది. ఏది ఏమైనా ఎన్నికలకు ముందు వరకు చీరాల వైసీపీలో కీలకంగా ఉన్న ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు వైసీపీని వీడి వెళితే చీరాలలో వైసిపి దిక్కులేనిది అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: