ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా... వైసిపి పార్టీకి సీట్లు రావడం జరిగింది. 175కు 175 సీట్లు సాధిస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందు ప్రకటించారు. కానీ ఎన్నికలు అయ్యేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. కథ అడ్డం తిరిగింది. జగన్మోహన్ రెడ్డి అండ్ టీం... కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో ఏపీలో అధికారం కోల్పోయింది వైసీపీ పార్టీ.


అలాగే ఎంపీ ఎన్నికల్లో... కేవలం నాలుగు స్థానాలు గెలుచుకున్న వైసీపీ పార్టీ... అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాది. తెలుగుదేశం కూటమికి  భారీ స్థాయిలో సీట్లు రావడంతో... తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. వైసిపి నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో వైసిపి నేతలు ప్రెస్ మీట్ లు పెట్టడానికి కూడా భయపడిపోతున్నారు. అసలు నియోజకవర్గంలో కనిపించకుండా హైదరాబాద్ లేదా విదేశాలకు వెళ్లి కాలం గడిపేస్తున్నారు వైసిపి నేతలు.

 

అయితే ఇలాంటి నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచల నాకేం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఐదు సంవత్సరాల కాలం పాటు మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలిచిన జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారట. బిజెపికి వ్యతిరేకంగా వ్యవహరించాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే పార్లమెంటులో ఎలాంటి బిల్లు బిజెపి తీసుకు వచ్చిన... వ్యతిరేకించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట.

 

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫు బోర్డు సవరణ సభ్యులను వ్యతిరేకిస్తున్నట్లు వైసిపి పార్టీ సంచలన ప్రకటన చేయడం జరిగింది. దీంతో వైసిపి పార్టీ... ఇండియా కూటానికి దగ్గర అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలలో అధికారంలో ఉన్నప్పుడు... కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నల్ల చట్టాలతో పాటు... సి ఏ ఏ, ఎన్ ఆర్ సి లాంటి బిల్లులకు జగన్ మోహన్ రెడ్డి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమితో.. బిజెపి ఉన్న నేపథ్యంలో జగన్ యూటర్న్ తీసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: