ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ నిరుద్యోగుల కల నేటితో నెరవేరింది.. గత ఆరేళ్లుగా డీఎస్సి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశ నేడు కూటమి ప్రభుత్వం మూలాన నెరవేరింది.. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా నింపకుండా నిరుద్యోగులను నిలువులా ముంచింది..అందుకే నిరుద్యోగులంతా ఏకమై కూటమి ప్రభుత్వాన్ని తీసుకోని వచ్చారు.. ముఖ్య మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకాన్ని 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పై పెట్టారు.. అయితే గత ఏడాది ఉపాధ్యాయ అర్హత పరీక్ష కూడా నిర్వహించారు.. సరిగ్గా నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి ఎస్ సి వర్గీకరణ అంశం తెర పైకి వచ్చింది.. దీనితో నోటిఫికేషన్ విడుదల ఆగి పోయింది.. ఎస్సి వర్గీకరణ పై సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు ఇవ్వడంతో రాష్ట్రం లో ఎస్సి వర్గీకరణ కోసం కూటమి ప్రభుత్వం జస్టిస్ రాజీవ్ మిశ్రా అధ్యక్షతన వన్ మాన్ కమిషన్ నియమించింది..

రాజీవ్ మిశ్రా కమిటీ 60 రోజుల గడువు కారణంగా చక చకా పనులు పూర్తి చేసింది..అదనంగా మరో 45 రోజులు సమయం తీసుకోని మార్చి 11 న తన రిపోర్ట్ ని సబ్ మిట్ చేసింది.. రాజీవ్ మిశ్రా రిపోర్ట్ ను అసెంబ్లీ లో తీర్మానం చేసి ఎస్సి వర్గీకరణ కోసం ప్రభుత్వం స్పెషల్ ఆర్డినేన్స్ తీసుకువచ్చింది.. దీనితో డీఎస్సి నోటిఫికేషన్ కు అడ్డు తొలిగింది..హుటా హుటిన ప్రభుత్వం  డీఎస్సి రోస్టర్ తయారు చేసి పోస్టులు సరళీకరణకు ఆదేశాలు జారీ చేసింది.. శనివారం రాత్రి డీఎస్సి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది.. నేడు ముఖ్య మంత్రి చంద్రబాబు పుట్టినరోజు కానుకగా నిరుద్యోగ అభ్యర్థులకు తీపి కబురు చెప్పారు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏ ఏ జిల్లాలకు ఎన్నెన్ని పోస్టులు కేటాయించారో లిస్ట్ విడుదల చేసారు.. నేడు పూర్తి నోటిఫికేషన్ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు..

ఏప్రిల్ 20 నుండీ మే 15 వరకు అప్లికేషన్ ధరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు.. అలాగే జూన్ 6 నుండి జులై 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.. అప్లికేషన్ ప్రాసెస్ వంటి వివరాలు నేడు విడుదల చేసే పూర్తి నోటిఫికెషన్ లో పొందు పరచనున్నారు.. ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయ నోటిఫికేషన్ విడుదల చేసి తమ మాట నిలబెట్టుకున్నామని కూటమి ప్రభుత్వం తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: