ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా అటు టిడిపి బిజెపి జనసేన పార్టీలు మూకుమ్మడిగా సీట్లను పంచుకోవడమే కాకుండా నేతలను కూడా ఎంచుకునే విధానంలో కూడా ఒకే పద్ధతి మీదికి వచ్చి మరి నిలబెట్టడం జరిగింది. అలా 164 స్థానాలను గెలవడం జరిగింది. అయితే గెలిచిన ఆనందం కంటే మరింత దిగులుగా నేతలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  అలా ఒక్కొక్కరుగా చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అసంతృప్తిని తెలియజేశారు. ఇప్పుడు తాజాగా మరొక జనసేన ఎమ్మెల్యే వాళ్లు సంచలన వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ఎమ్మెల్యే ఎవరో కాదు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్. ఈ రోజున ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎన్డీఏ ఎమ్మెల్యే అని తాను చనిపోతే ఉప ఎన్నిక వస్తుందని చాలామంది ఎమ్మెల్యేలు అయిపోవాలని చూస్తున్నారంటూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరో త్యాగాల వల్ల తనకు ఈ ఎమ్మెల్యే సీటు రాలేదని తెలియజేశారు. మూడు పార్టీలు కలసి తనని గుర్తించి మరి తనకు ఈ సీటు ఇచ్చారని తెలియజేశారు. తాను గెలిచిన తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజల కోసమే తాను పనిచేస్తున్నానంటూ తెలియజేశారు.


అధికారులను ఇబ్బంది పెట్టి వారిని బెదిరిస్తే అసలు ఊరుకునేదే లేదని వారిని కాపాడుకుంటూ ముందుకు వెళ్తానంటూ తెలియజేశారు. తాను చనిపోయిన తరువాతే మీరు ఎమ్మెల్యే అవ్వాలంటూ తాను కోరుకుంటున్నాను అని తెలిపారు. తనకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లి సీటు కేటాయించడం వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు ఎవరి దయవల్ల తాను గెలవలేదని కూడా తెలియజేశారు. తాడేపల్లి ని మరొక పిఠాపురం చేస్తానంటూ తెలియజేశారు. తాడేపల్లిలో తాను గాజులు వేసుకుని కూర్చోలేదు కదా తాను స్థలాలు, పొలాలు వంటివి ఎక్కడా కూడా దౌర్జన్యంగా తీసుకోలేదు కదా తనకు ఓట్లు వేసిన ప్రజల కోసమే తాను పనిచేస్తున్నాను అంటు తెలియజేశారు. టిడిపి పార్టీలో ఏ కార్యకర్తను కూడా తాను ఇప్పటివరకు ఇబ్బంది పెట్టలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: