ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైనికులు పాకిస్తాన్లోని అటాక్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే భారత ప్రభుత్వం కేవలం ఉగ్రవాదులను మాత్రమే హతం చేయాలి అనుకుంటుంది.కానీ పాకిస్తాన్ మాత్రం ఎవర్ని వదలడం లేదు. ఇక భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ని పాకిస్థానీయులు తప్పుగా చెప్పుకొస్తున్నారు.ఆపరేషన్ సింధూర్ కారణంగా చాలామంది ప్రజలకు ఎఫెక్ట్ పడిందని, ప్రజలు చనిపోయారు అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ చేసిన ఈ అబద్ధపు ప్రచారాలను తిప్పికొడుతూ మేము కేవలం  ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేశామని, ప్రజలకు మావల్ల ఎలాంటి ఎఫెక్ట్ జరగలేదని చెప్పుకొచ్చారు. అయితే భారత్ మాపై యుద్ధం ప్రకటిస్తే దెబ్బకు దెబ్బ తీస్తామని, ముందుంది ముసళ్ళ పండుగ అంటూ ఇలా పాక్ దేశంలోని ప్రధానమంత్రి, రక్షణ మంత్రులు చెప్పుకొస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో.. ఆయన పాకిస్తాన్ జాతీయ భద్రత సలహాదారుతో మాట్లాడుతూ.. కీప్ క్వైట్ అంటూ చెప్పారు. అంతేకాదు భారత్ పై పాకిస్థానీయులు చేసిన దొంగ దెబ్బకు ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే హక్కు భారత్ కి పూర్తిగా ఉంది అని,ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై పాకిస్థానీయులు మౌనంగా ఉండటమే చాలా మంచిది అని చెప్పుకోచ్చారట.

అంతేకాదు భారత్ యాక్షన్ కి కౌంటర్ గా పాక్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకూడదని,ఒకవేళ పాకిస్తాన్ చర్యలు తీసుకుంటే మాత్రం అస్సలు బాగోదని, భారతదేశం మీద యుద్ధం ప్రకటించడానికి ధైర్యం చేయొద్దు అంటూ పాకిస్తాన్ భద్రతా సలహాదారుకి అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో చెప్పారు. ఒక రకంగా ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి అంటే సైలెంట్ గా ఉన్న భారత్ ని గిచ్చి మరీ రెచ్చగొట్టడం వల్లే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని,ఇప్పటికైనా మూస్కొని కూర్చుంటే మంచిది అని పాకిస్తానీయులకు హితవు పలికినట్టు అర్థం చేసుకోవచ్చు. మరి పాకిస్తాన్ సైలెంట్ గా ఉంటుందా ఇలాగే దొంగ దెబ్బలు తీస్తూ భారతదేశ పౌరులను మరింత రెచ్చగొడుతుందా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: