వారిద్దరూ ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళ ప్రజాప్రతినిధులు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరొకరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ ఇద్దరు ఒకే జిల్లాకు చెందినవారు. సదరు ఎంపీ ప్రాతనిత్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకే ఆ మహిళ ఎమ్మెల్యే ప్రాథమిత్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కూడా వస్తుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల నుంచి వీరిద్దరూ ఎడమొఖం పెడముఖంగా ఉంటున్నారు. ఉప్పు నిప్పుగా ఉంటున్నారు. ఒకరి పొడ కూడా మరొకరికి గిట్టడం లేదన్న ప్రచారం కూడా జిల్లా రాజకీయ వర్గంలో వినిపిస్తోంది. వారిద్దరు ఎవరో కాదు మాజీ మంత్రి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ .. నంద్యాల ఎమ్మెల్యే బైరెడ్డి శబరి కావటం విశేషం.


గత సార్వత్రిక ఎన్నికలలో నంద్యాల ఎంపీ అభ్యర్థిగా అఖిల భర్త భార్గవ్ రామ్ నామినేషన్ వేయడంతో వీరిద్దరి మధ్య గొడవలు ముదిరి పాకనపడ్డాయి. అయితే నామినేషన్ ఉపసంహరణ చివరి రోజు భార్గవ్ రాం తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. టిడిపి అధిష్టానం నుంచి సీరియస్గా ఆదేశాలు రావడంతో ఆయన తన నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. ఎన్నికల సమయంలో తమ కోరిన మొత్తాన్ని ఎంపీ అభ్యర్థి ఇవ్వ‌క పోవడంతో కావాలనే భార్గవ్ ఇలా చేశారనే ప్రచారం అప్పుడే జిల్లాలో జరిగింది. ఇక ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి అఖిలప్రియ శబరి ఒకరిని ఒకరు చూసుకున్నది లేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంపీ శబరి అడుగుపెట్ట లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


ప్రోటోకాల్ ప్రకారం ఎంపీకి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని టిడిపి నాయకులు చెబుతున్నారు. అయితే కొన్ని నెలల క్రిందట సిరివెళ్లలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఎంపీ శబరి ఒక గంట మాత్రం ఉండి వెళ్ళిపోయారు. ఎంపీగా బైరెడ్డి శబరి గెలిచిన ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్ని తానై వ్యవహరించారని అందుకే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళయని అంటున్నారు. ప్రతి విషయంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చొరవ చూపుతున్నారని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ మంత్రులు.. ఎమ్మెల్యే గారు గుస్సాగా ఉన్నట్టు తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: