
వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, కడప మేయర్ సురేశ్ బాబుపై కూటమి ప్రభుత్వం వేటు వేసింది. కడప అభివృద్ధి పనుల్లో భాగంగా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ సురేశ్ బాబును మేయర్ పదవి నుంచి తప్పిస్తూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసి బిగ్ షాక్ ఇచ్చింది.
అటు బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై పెట్టిన అవిశ్వాసం తీర్మానంలో టీడీపీ నెగ్గింది. ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే కొండయ్య ఓట్లతో పాటు ఆమంచి వర్గం ఐదుగురు కౌన్సిలర్లతో కలుపుకొని 26 ఓట్లతో టీడీపీ చీరాల మున్సిపాలిటీ తన ఖాతాలో వేసుకోగా.. శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇంకోవైపు పల్నాడు జిల్లా మాచర్లలోనూ వైసీపీకి దెబ్బ పడింది. మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ తురకా కిశోర్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి అనుమతి లేకుండా వరుసగా 15 కౌన్సిల్ సమావేశాలకు అతడు గైర్హాజరు కావడం, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం..ఏపీ మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 16(1)(కె) ప్రకారం తురకా కిశోర్ కు ఉద్వాసన పలికింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు