- ( ఉత్త‌రాంధ్ర‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

వైసీపీ మేయర్ ని , డిప్యూటీ మేయర్ ని మహా విశాఖ నగరపాలక సంస్థలో కూటమి నేతలు దించేశారు.. అవిశ్వాస తీర్మానాన్ని జనం ముందు సమర్ధించుకున్నారు. ఇప్పుడు జీవీఎంసీలో కూటమి పాలనకు తెరలేవ‌గా టిడిపికి చెందిన వారిని మేయ‌ర్‌గా ఎంపిక చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు డిప్యూటీ మేయర్ విషయంలో మల్ల గుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19 సోమ‌వారం డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంది. డిప్యూటీ మేయర్ పదమని జనసేనకు ఇవ్వాలని అనధికారికంగా ఒప్పందం ఉంది. జనసేనలో డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎవరా అనుకుంటే ? వైసీపీలో ఉంటూ జనసేనలోకి వెళ్లిన ఒక మహిళా కార్పొరేటర్ పేరు వినిపిస్తోంది. జనసేనకు 13 మంది కార్పొరేటర్ల బలం ప్రస్తుతం ఉంది. ఆ పార్టీ 2021 ఎన్నికలలో గెలుచుకుంది కేవలం ముగ్గురు కార్పోరేటర్ లనే..! డిప్యూటీ మేయ‌రు పదవి కోసం పార్టీ సింబల్ తో గెలిచిన ముగ్గురు కంటే కూడా వైసిపి నుంచి ఫిరాయించిన వారి మధ్య ఇప్పుడు గట్టి పోటీ ఉంది.


అలా వైసీపీ నుంచి వచ్చిన ఓ మహిళ కార్పొరేటర్కు డిప్యూటీ మేరు పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే జనసేనలో మొదటి నుంచి ఉన్న ముగ్గురు నుంచే డిప్యూటీ మేయర్ ని ఎంపిక చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వారికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని అనుకుంటే .. తామే టిడిపి నుంచి అభ్యర్థిని పెట్టి ఆ పదవి కూడా తీసుకుంటామని తెలుగుదేశం నేతలు అంటున్నారట. మరి వైజాగ్ డిప్యూటీ మేయ‌రు ఎవరు అన్నది ? కొద్ది గంటల్లో తేలిపోయి ఉత్కంఠకు తెరపడనుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: