గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని మేఘని నగర్ ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం అందరికి తెలిసిందే .. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. . ఎయిర్ పోర్ట్ నుంచి టెక్ ఆఫ్ అయినా నిమిషాలకు విమానం సమీపంలోనే మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది .. అలాగే ఆ సమయంలో భారీ పేలుడు స్తంభవించింది అని కూడా అంటున్నారు . ఇక ప్రమాదంలో విమానంలో ఉన్న వారితోపాటు హాస్టల్లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ కూడా అక్కడికక్కడే మరణించారు .. ఈ దారుణ సంఘటన తర్వాత పలు భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయానికి వెళ్లే దారులన్నీ మూసేశారు .. ఇదే క్రమంలో ఈ భయానకమైన ప్రమాదం తర్వాత .. ఎక్కువగా విమానంలో తిరిగే వారిలో ఒక ఆందోళన మొదలైంది ..

ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో ఏ భాగంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉంటారని డౌట్స్ అందరిలో కలుగుతున్నాయి .. విమానంలో ముందు భాగంలో కూర్చుంటే సురక్షితంగా ఉంటారా ? లేక వెనక భాగంలో కూర్చోవాలా ? లేదంటే మధ్య భాగంలో సీట్ బుక్ చేసుకోవాలా ? ఇలా రకరకాల డౌట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .. విమానంలో బిజినెస్ క్లాస్ , ఎకానమీ అంటూ పలు విభాగాలు ఉంటాయి .. బిజినెస్‌ క్లాస్  టికెట్లు  ఎక్కువ ధర ఎక్కువ సౌకర్యాలు కలిగి ఉంటాయి .. అలాగే ఎకనామిక్ క్లాసులో తక్కువ ధర టికెట్లు ఉంటాయి .. అయితే ఇక్కడ విమానంలో ఎంతో సేఫ్ అయిన సీటును  బుక్ చేసుకోవాలని ప్రశ్న అందరిలో వ‌స్తున్న క్రమంలో పలు నివేదికలు సర్వేలు వాటి గురించి ఈ విధంగా చెబుతున్నాయి ..

ప్రధానంగా విమానంలో వెనుక వరుసలో కూర్చోవడం అనే ఆలోచన చాలామంది ప్రయాణికులకు అసలు నచ్చదు .. మరీ ముఖ్యంగా మధ్య సీట్లో కూర్చోవడం వారికి అసలు ఇష్టం ఉండదు .. గత 35 ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాల్ల డేటాను పరిశీలించి చూస్తే 2025లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం విమాన ప్రమాదాల్లో వెనక సీట్ల కూర్చున్న ప్రయాణికుల మరణాలు తక్కువగా ఉందని తెలుస్తుంది .. అలాగే ఆ నివేదిక ప్రకారం విమానం వెనక సీట్లో మరణాలు రేటు 32 శాతంగా ఉంది .. అలాగే మధ్యలో 39 శాతం , ముందుసీట్లో 38 శాతంగా నమోదయింది ..

ఇదే క్రమంలో ఏప్రిల్ 2012 లో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ బృందం .. మెక్సికో లో జరిగిన విమాన ప్రమాదాన్ని అనుకరించింది .. అదే విధంగా చేసిన‌ పరీక్ష ఫలితాల్లో విమానం ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులకు ప్రమాదంలో అధిక గాయాలయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని  ఈ పరీక్ష నిరూపించింది .. అదేవిధంగా దానికి విరుద్ధంగా విమాన రెక్కలకు దగ్గరగాకూర్చున్న ప్రయాణికులకు గణనీయమైన గాయాలు అవుతాయని ఈ పరీక్ష చెప్పుకొస్తుంది .  అలాగే విమానం వెనుక భాగంలో కూర్చున్న వారికి చాలావరకు ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంటాయని ఈ పరీక్ష తెలిపింది .  అంటే వెనక ప్రాంతంలో కూర్చున్న చాలా మంది ప్రయాణికులకు ఎక్కువ శాతం బ్రతికే అవకాశం ఉంది .  అందుకే ఎక్కువగా అందరూ విమానాలో వెనుక భాగంలో కూర్చోవడం  ఎంతో సేఫ్ అని చెప్పవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: