- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

రాజకీయాల్లో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రత్యర్థి పార్టీని నానా ఇబ్బందులకు గురి చేయడం .. ఆ పార్టీకి చెందిన పలువురిని తమ పార్టీలోకి లాగేసుకోవడం కామ‌న్‌. ఇందుకోసం రకరకాల ఎత్తుగడ‌లు వేస్తూ ఉండటం .. రకరకాల ప్రణాళికలు అమలు చేయడం తెలుగు రాజకీయాలలో కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతూ వస్తుంది. అయితే ఇందుకు వారు అనుసరిస్తున్న విధానాలు మాత్రం రకరకాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టే ప్రక్రియ జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆ పార్టీని పోషించేవారు .. సానుభూతిపరుల వ్యాపారాలు టార్గెట్ చేస్తున్నారు. నిబంధనలు బూచిగా చూపించి వారి ఆర్థిక వనరులను బలహీనం చేస్తున్నారు. అలా ఆ పార్టీ చితికి పోతుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే వైసిపి గత ఎన్నికలలో కేవలం 11 సీట్లకే పరిమితం అయింది.


వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మండల , గ్రామస్థాయిలో ఆ పార్టీని మరింత బలహీనం చేసే ప్రక్రియకు కూటమి ప్రభుత్వం చాప కింద నీరుల ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆ పార్టీ కార్యకర్తల వ్యాపారాలు .. వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేలా ప్రభుత్వం వ్యవహరించబోతుందని వైసిపి వర్గాలు సైతం సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ ముద్ర ఉంటే చాలు వారు పార్టీలో యాక్టివ్గా ఉంటే ఏదో ఒక కేసులో ఇరికించడం పెద్ద పని కాదు. వారు చేస్తున్న వ్యాపారాలను ఏదో ఒక నిబంధనలు సాకుగా చూపించి ఇబ్బందులకు గురి చేయవచ్చు. ఇలా వారిని ప్రజల్లో లేకుండా చేయడం ద్వారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో సులువుగా విజయం సాధించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.


ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: