వైసిపి అధినేత మాజీ సీఎం జగన్ కు మరో బిగ్ షాక్ తగలబోతుందా ? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి .. గత ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కూటమి పార్టీలో చేరిన విషయం తెలిసిందే .. ఈ తంతు ఇంకా జరుగుతూనే ఉంది .. ఇక ఎప్పుడు తాజాగా మరో కీలకమైన నేత వైసిపికి గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి .. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీమంత్రి ధర్మాన ప్రసాద్ రావు .. ప్రస్తుతం వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు .. ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో హాట్‌ టాపిక్ గా మారింది .. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలకంగా ఉన్న ధర్మాన , వైసీపీలో చేరిన తర్వాత 2019లో మంత్రిగా కూడా సేవలు అందించారు ..


అలాగే 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పినట్టు కనిపిస్తుంది .. రీసెంట్గా వైసిపి నిర్వహించిన సమావేశాలకు కూడా ఆయన హాజరు కాకపోయటం ఇప్పుడు సంచలనంగా మారింది . అలాగే వైసిపి అధినేత జగన్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందే ధర్మాన కలిసినట్టు తెలుస్తుంది .. అప్పట్లోనే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారని, తన కొడుకుకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరినట్టు తెలుస్తుంది .. కానీ జగన్ సూచన మేరకు ధర్మాన పోటీ చేసిన ఓటమి తర్వాత పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు .. శ్రీకాకుళం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించిన రోజున కూడా ఆయన అక్కడే ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనక పోవడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది .. ఇలాంటి చేష్టల ద్వారా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని కూడా అంటున్నారు .


అలాగే ధర్మాన కుమారుడు ధర్మాన రామమోహన్ రావు ప్రస్తుతం రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది .. కానీ ఆయన ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతారనేది మాత్రం స్పష్టత లేదు .. జనసేనలోకి ధర్మాన కుటుంబం వెళ్లి అవకాశం ఉందంటూ ఊహ గానాలు గట్టిగా వినిపిస్తున్నాయి .. ఇదే జరిగితే శ్రీకాకుళం జిల్లాలో జనసేనకి బలమైన నాయకత్వం ద‌క్కే అవకాశం ఉంది .. ఇలా ఈ మొత్తంగా ధర్మాన తన బరువుని బాధ్యతల్ని తన కొడుక్కి అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా , ఆయన రాజకీయంగా తీసుకునే నిర్ణయం ఏంటి అనేది ఎప్పుడు అందరిలో ఎంతో ఆస్తిగా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: