- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

మంత్రి పదవి పై దానం నాగేందర్ మరోసారి గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికలలో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున దానం నాగేందర్ విజయం సాధించారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ వచ్చింది. కొద్ది నెలలకే నాగేంద్ర కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటిదాకా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. హైడ్రా తో పాటు వివిధ అంశాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కెసిఆర్ - కేటీఆర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ప్లేటు కి రాయించారు. మళ్లీ కాంగ్రెస్ తరపున బిఆర్ ఎస్ కు సవాళ్లు విసురుతున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిపిస్తానని అంటున్నారు. రేవంత్ ఢిల్లీ వెళ్లడంతో దానం కూడా వెళ్లారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ బాధ్యత తాను తీసుకుంటానని కాంగ్రెస్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ప్రతిపాదన పెడుతున్నట్టు తెలుస్తోంది.


దానం నాగేంద్రకు జూబ్లీహిల్స్ లో మంచి పట్టు ఉంది. వాస్తవానికి ఆయన గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే పిజెఆర్ తనయుడు విష్ణు జూబ్లీహిల్స్ కోరుకోవడంతో నాగేంద్ర ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. అందుకే ఈ ఉపఎన్నికను మంత్రి పదవి కోసం తనకు అనుకూలంగా మార్చుకోవాలని దానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ చాలా కీలకం. ప్రభుత్వం పై ప్రజల్లో నమ్మకం తగ్గలేదని నిరూపించుకోవాలి. గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒక సీటుకు మాత్రమే పరిమితమైంది. ఈసారి ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ గెలుచుకుంటే రేవంత్‌కు అధిష్టానం వద్ద పలుకుబడి పెరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ బాధ్యత నాగేంద్రకు ఇస్తే ఖచ్చితంగా ఆయన త‌న‌దైన‌ రాజకీయం చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఇక దానం ఇక్కడ పార్టీని గెలిపించి మంత్రి పదవి తీసుకోవాలని తన ప్రయత్నాల్లో తాను ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు అనుహ్యంగా యూటర్న్ తీసుకుని బి.ఆర్.ఎస్ పై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: