
ఈ నలుగురు ఉద్యోగులు కూడా క్రిస్టియన్ మత సాంప్రదాయాలను అనుసరిస్తున్నారనే విషయాన్ని గుర్తించి మరి టీటీడీ సస్పెండ్ చేసింది. హిందూ ధార్మిక సంస్థలలో వీరు విధులు నిర్వహిస్తూ నియమావాళికి విరుద్ధంగా అన్యమతాన్ని అనుసరించడం నిబంధనలు ఉల్లంఘించినట్లుగా టీటీడీ భావిస్తూ వీరిని సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించింది. టీటీడీ విజిలెన్స్ విభాగంలో సమర్పించిన నివేదికలతో పాటుగా మరికొన్ని ఆధారాలను పరిశీలించి.. వీరిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఈ నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్ వెంటనే అమలులోకి వచ్చిందని తెలిపారు.
ఈ నలుగురు ఉద్యోగులు 2007 ముందు టీటీడీలో ఉద్యోగులుగా చేరి ఉంటే మాత్రం కచ్చితంగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉన్నదట.. ఎందుకంటే 2007 ముందు టీటీడీలో హిందువులే చేరాలనే నిబంధనలు లేవని.. గతంలో ఇలాంటి ఆరోపణలతో ఒక అధికారిని సస్పెండ్ చేయగా న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ ఉద్యోగుల విషయంపై ఇంకా ఏ విధమైనటువంటి స్పష్టత కనిపించలేదు. ఈ ఉద్యోగుల సస్పెన్స్ తో మిగిలిన ఉద్యోగులకు ఒక హెచ్చరిక ఉంటుందని తిరుమల భక్తులు భావిస్తున్నారు. మరి ఇంకా ఎవరెవరు బయటకు వస్తారో చూడాలి.