- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్‌ టాపిక్ గా మారింది. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా ఇదే విషయం చర్చిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న నియోజకవర్గాలకు అభివృద్ధి నిధుల గురించి ప్రభుత్వం ఇప్పటివరకు చర్చించడం లేదు. పైగా ఆర్థిక పరిస్థితులు బాగోలేదని చెబుతోంది. వాస్తవానికి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిధులు కేటాయించాలి. ఇది నిబంధన కూడా .. కానీ ఏడాది కాలం దాటిపోయిన కూడా ఇప్పటివరకు చంద్రబాబు నిధుల గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదు. ప్రస్తుతం 50 వరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పర్యటించి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రజల నుంచి విమర్శలతో పాటు ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గత ఎన్నికలలో తమ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తాము అని చెప్పారని .. ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నారు. దీనిపై కూడా ఓ ఎమ్మెల్యే మౌనం వహించారు.


సమస్య చిన్నదా అయినా చేసేందుకు నిధులు లేవు. 2014 - 2019 మరియు చంద్రబాబు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించారు. ప్రతి ఆరు మాసాలకు కనీసంలో కనీసం రెండు కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. ఇప్పుడు ఆ మాటే లేదు. వైసిపి హయంలో ఇలాగే జరిగింది. ముందు అసెంబ్లీ వేదికగా అప్పటి సీఎం జగన్ ప్రతి నియోజకవర్గానికి 50 కోట్ల వరకు నిధులు ఇస్తామని .. చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి కూడా నిధులు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. చివరికి ఎవరికి రూపాయి నిధులు ఇవ్వలేదు. దీనికి కారణం ప్రజలకు ఇస్తున్న సంక్షేమానికి నిధులు సరిపో లేదని తేల్చి చెప్ప‌డ‌మే..! కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి నెలకొంది అన్న చర్చ రాజకీయ వర్గాలలో సాగుతుంది. ఒకవైపు సంక్షేమం మరోవైపు కేంద్రం నుంచి తెస్తున్న నిధులతో ప్రభుత్వం నేరుగా రహదారులు నిర్మాణం చేపట్టింది. ఇక ఎమ్మెల్యేలకు నేరుగా నిధులు ఎందుకు అన్న ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది అన్న గుసగుసలు పార్టీ వర్గాలలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: