ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరాలజల్లు కురిపించారు. చేనేత రంగానికి సంబంధించి మద్దతుగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.. చేనేత వస్త్రాల పైన విధించేటువంటి జీఎస్టీ భారాన్ని కూడా ఇక ఏపీ ప్రభుత్వమే భరిస్తుంది అంటూ ప్రకటించారు. ఈ నిర్ణయం అటు చేనేత కార్మికులకు మరింత ఊరటను కలిగించనుంది.


నిన్నటి రోజున ఒక సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పలు ప్రకటనలు చేశారు. చేనేత కార్మికుల భద్రత కోసమే రూ  5 కోట్లతో ట్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామంటూ తెలిపారు. అలాగే మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంట్ అందజేస్తామంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తేదీన అమలు చేయడానికి సిద్ధమవుతున్నామంటూ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తులకు ఇటీవలే 10 జాతీయ అవార్డులు కూడా లభించాయని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణం అంటూ తెలియజేశారు.


వ్యవసాయం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా మారిందంటూ సీఎం చంద్రబాబు తెలియజేశారు. అయితే చేనేత పరిశ్రమంలోని చాలా కులాలు ఉన్నాయని అందరికీ కూడా ఇవి వర్తిస్తాయని తెలియజేశారు.  ఇటీవలే జమ్మలమడుగు పర్యటనలో భాగంగా కొంతమంది చేనేత కుటుంబాలు తమకి ఉన్న ఇబ్బందులను తమ దృష్టికి తీసుకువచ్చారని ఇలాంటి సమయంలోనే నిర్ణయాలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. చేనేతతో అనుసంధానంగా మరికొన్ని చేతి వృత్తులు చేసే వారు కూడా ఉన్నారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరిచే విధంగా చేనేత కార్మికులకు మరిన్ని ఉపయోగాలు కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటామంటూ ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయం చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు చేనేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: